Wednesday, January 22, 2025

గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, రాష్ట్ర శాసన సభ ఆమోదించిన కొన్ని బిల్లులను క్లియర్ చేయడంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాప్యం చేయడంతో పాలనకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని అధికార భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రక్షించేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవలసి ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తూ సమాంతర వ్యవస్థను నడుపుతున్నందుకు బిఆర్‌ఎస్ నాయకులు గవర్నర్‌ను లక్షంగా చేసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రతిష్టంభన ఏర్పడడంతో గత నెలలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు పిటిషన్‌ను దాఖలు చేసింది. దాంతో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య ఉన్న విభేదాల్లో మలుపు వచ్చింది.

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సెషన్‌లో గత నెలలో కుదిరిన సంధితో, సౌందరరాజన్ బిల్లులను ఆమోదిస్తారని బిఆర్‌ఎస్ భావించింది. వాటిలో కొన్ని గత సెప్టెంబర్ నుంచి పెండింగ్‌లో ఇప్పటికీ ఉన్నాయి. కానీ రాజ్‌భవన్ నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో బిఆర్‌ఎస్ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి) దాఖలు చేయడం ద్వారా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న పది బిల్లులకు ఆమోదం తెలుపడం ద్వారా రాజ్యాంగ బాధ్యతను నెరవేర్చేలా గవర్నర్‌ను ఆదేశించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది.

గవర్నర్ చేస్తున్న జాప్యాన్ని ‘చట్టవిరుద్ధం’, ‘అక్రమం’, ‘రాజ్యాంగ విరుద్ధం’ అని ప్రకటించాలని పిటిషన్‌లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు. రాష్ట్రప్రభుత్వం షంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రానికి మధ్య నడిచిన కేసును ప్రస్తావించింది. అక్కడ ‘మంత్రి మండలి సలహాకు విరుద్ధంగా గవర్నర్‌ను అనుమతించడం ద్వారా సమాంతర పరిపాలనను రాజ్యాంగం కల్పించలేదని’ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News