Wednesday, January 22, 2025

హైదరాబాద్ విముక్తి కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవంపై దేశ ప్రజలందరికీ తెలియాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు అందరూ శ్రద్ధాంజలి ఘటించాలని కోరారు. దివంగత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్ల హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిందన్నారు. వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదని, హైదరాబాద్ విముక్తి కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. రావి నారాయణ రెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహరావుకు అమిత్ షా శ్రద్ధాంజలి తెలిపారు. ఆపరేషన్ పోలో పేరుతో నిజాం మెడలు పటేల్ వంచారని, రక్తం చిందకుండా నిజం రజాకారులు లొంగిపోయేలా చేశారని అమిత్ షా ప్రశంసించారు. జి20 సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు భారత్ సంస్కృతి సంప్రధాయాలు తెలిశాయని పేర్కొన్నారు.

Also Read: గ్రూప్ 4 ఉద్యోగులుగా 6603 జెపిఎస్‌లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News