Wednesday, January 22, 2025

విమోచన దినోత్సవం మోడీ ఘనత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నిజాం పాలనలో మహిళలపై లెక్కలేనన్ని ఆగడాలు జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రజాకార్లు అనేక గ్రామాల్లో హత్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని తెలిపారు. సర్దార్ పటేల్ కృషి వల్ల నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలు విముక్తి పొందారని చెప్పారు. కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలకు ఆయ న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండ్, కర్ణాటక రవాణాశాఖ మంత్రి బి శ్రీరాములు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, రా ష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్‌తో పాటు ఇతర ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జలియన్‌వాలాబాగ్ తరహా ఘటన గుండ్రాంపల్లిలో జరిగిందన్నారు.

సర్దార్ పటేల్ చొరవతో పోలీసు చర్య తీసుకోవడం వల్లే తెలంగాణ విముక్తి సాధ్యమైందని అన్నారు. ఆనాడు 109 గంటల పాటు సైనిక చర్య అవిశ్రాంతంగా జరిగిందన్నారు. పటేల్ లేకుంటే తెలంగాణ విముక్తికి మరింత సమయం పట్టేదన్నారు. తెలంగాణకు, కర్ణాటక, మహరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చిందని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించలేదన్నారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఇన్నాళ్లు వేడుకలను జరపలేదని విమర్శించారు. ప్రధాని మోడీ ఈ ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. ఏ భయం లేకుండా వేడుకలను చేసుకోవాలని ప్రజలను కోరుతున్న ట్టుగా చెప్పారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినవ సర్దార్ పటేల్ అని అన్నారు. అమరవీరులకు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు.

సెప్టెంబర్ 17 నిజాం నియంతృత్వ పాలనకు చరమగీతం పాడిన రోజు అని అన్నారు. 1948లో నిజాంను ఓడించి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ జెండాను గర్వంగా ఎగరవేశారని గుర్తుచేశారు. 25 ఏళ్ల నుంచి ఈ వేడుకలను నిర్వహించా లని పోరాటం చేస్తున్నామని చెప్పారు. బిజెపి పోరాటంతోనే ఇప్పుడు విమోచన దినోత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. 1948లో నిజాంను ఓడించి సర్దార్ పటేల్ జాతీయ జెండాను ఎగరవేశారని 75 ఏళ్ల తర్వాత అధికారికంగా ఉత్సవాలు నిర్వహి స్తున్నామని చెప్పారు. మళ్లీ 75 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ 17న హైదరాబాద్ గడ్డపై త్రివర్ణ పతాకం ఎగురుతోందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News