Monday, December 23, 2024

 రవీంద్రభారతిలో తెలంగాణ సాహిత్య దినోత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేడు ఆదివారం నాడు తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 9 ఏండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు, సాహిత్య వైభవాన్ని చాటి చెప్పేలా సాహిత్య దినోత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గంగా జమునా తెహజీబ్ ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు భాషలలో రాష్ట్రస్థాయిలో 33 జిల్లాల్లో 3 విభాగాలైనా పద్యం, ఉర్దూ కవిత్వం, రచనంలలో కవి సమ్మేళనాలను రాష్ట్రస్థాయిలో రవీంద్ర భారతిలో నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం వరకు జరిగే ఈ కవి సమ్మేళనంలో అవార్డు పొందిన దాదాపు 150 మంది కవులు పాల్గొంటారు.

ఎంపికైన ఉత్తమ కవితలకు మొదటి బహుమతిగా రూ.1 లక్ష 116 రూపాయలను, రెండవ బహుమతిగా రూ. 75 వేల 116 రూపాయలను, మూడోవ బహుమతిగా రూ. 60 వేల 116 రూపాయలను, చతుర్థ బహుమతిగా రూ. 50 వేల 116 రూపాయలు, పంచమ బహుమతిగా రూ.  30 వేల 116 రూపాయలు బహుమతిగా అందించి కవులను, సాహితీ వేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని జూన్ 11వ తేదీన అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కవులను సాహితీవేత్తలను గుర్తించి వారిని సత్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ సాహిత్య దినోత్సవంలో కవులు, సాహితీవేత్తలు ఇదే ఆహ్వానంగా భావించి తెలంగాణ సాహిత్య దినోత్సవం లో పాల్గొనాలని సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News