Sunday, November 3, 2024

తెలంగాణ సాహిత్యాన్ని దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా కృషి చేస్తా….

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సాహిత్యాన్ని దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా కృషి చేస్తా….
మంత్రి శ్రీనివాస్ గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్:  సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాహిత్యాన్ని దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా సాహిత్య సృష్టికి కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ నేతృత్వంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీని తాండూరు శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో చైర్మన్ జూలూరు గౌరీశంకర్ నేతృత్వంలో తెలంగాణ సాహిత్య ప్రతిభా సామర్ధ్యాలను ప్రపంచానికి చాటాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. రాష్ట్రం సిఎం కెసిఆర్ నేతృత్వంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సాహిత్య రంగంలో తెలంగాణ పూర్వ వైభవాన్ని చాటేలా కవులను, సాహితీ వేత్తలను తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ప్రోత్సహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

అకాడమీ వైభవాన్ని చాటేలా కృషి చేస్తా: జూలూరు

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుట్టిన రోజు (16.03.2022) సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని ఆవిష్కరించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ల సహకారంతో తెలంగాణ సాహిత్య అకాడమీ వైభవాన్ని చాటేలా కృషి చేస్తామన్నారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు, కళలు, కవిత్వం, సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా రచనలను రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బేవరేజ్ సంస్థ చైర్మన్ గజ్జెల నగేష్, ప్రముఖ కవులు కోట్ల వెంకటేశ్వర రెడ్డి, కెపి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News