హైదరాబాద్: డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్నారని, అదే తాము అడుగుతున్నామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి తెలిపారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై శాసన సభలో చర్చ సందర్భంగా కడియం మాట్లాడారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంవత్సరానికి రూ.1.36 లక్షల కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. రుణమాఫీ సహా కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్‌కు అయ్యే వ్యయం అదనంగా ఉంటుందని వివరించారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేస్తామని బడ్జెట్‌లో చెప్పారని, 119 నియోజకవర్గాల్లో 4.16 లక్షల ఇళ్లకు రూ. 24 వేల కోట్లు అవసరం అవుతున్నాయని కడియం వివరణ ఇచ్చారు. బడ్జెట్‌లో ఇళ్ల కోసం కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామన్నారని, కేవలం ఇంటికి ఒక్కరికే రూ.2500 ఇచ్చిన రూ.20 వేల కోట్లు అవసరం అవుతాయని, రూ.2500 ఇచ్చే అంశాన్ని బడ్జెట్‌లో ఎందుకు ప్రస్తావించలేదని కడియం అడిగారు.
డిసెంబర్ 9న చేస్తామన్న రైతురుణమాఫీ ఏమైంది: కడియం
- Advertisement -
- Advertisement -
- Advertisement -