హైదరాబాద్: తెలంగాణలో 17 స్థానాలకు లోక్ సభ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. అయితే ఎన్నికల ప్రచారం మటుకు శనివారంతో ముగియనున్నది. సాధారణంగా పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. అయితే ఇటీవల టైమింగ్ కాస్త చేంజ్ అయింది. రాష్ట్రంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్ జరుగనున్నది.
తెలంగాణ రాష్ట్రంలో వీలయినంత మేరకు ఎక్కువ సీట్లు గెలువాలని కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ పట్టుగా ఉన్నాయి. అయితే ప్రజల నాడి ఇప్పుడప్పుడే తెలియదు కదా ! ఇక తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలు ఇవే: ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్(ఎస్సీ), నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్(ఎస్టీ), ఖమ్మం.
హైదరాబాద్ లో మజ్లీస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని బిజెపి అభ్యర్థి మాధవీ లత అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనప్పటికీ రేపటితో ప్రచారం ఖతం.