Wednesday, January 22, 2025

కేంద్రానికి తెలంగాణ రుచి చూపిస్తాం

- Advertisement -
- Advertisement -
Telangana Ministers Fire On rise in fertilizer prices
ఎరువుల ధరల పెంపుపై మంత్రుల ఫైర్
ఎరువుల ధరలను పెంచాలని చూస్తే
తెలంగాణ దెబ్బ రుచి చూపిస్తాం
 రైతు వ్యతిరేక విధానాలను వెంటనే మార్చుకోవాలి
 కేంద్రంపై మరోసారి రాష్ట్ర మంత్రుల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఎంఎల్‌సిలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంపై రాష్ట్ర మంత్రు లు మరోసారి దండయాత్ర చేశారు. మాటలను తూటాల్లా పేల్చారు. పదునైన విమర్శలతో విరుచుకపడ్డారు. రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎరువుల ధరలను పెంచాలని చూస్తే కేంద్రానికి తెలంగాణ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తామన్నారు. పెద్దఎత్తున ఆందోళనలు చేసి కేంద్రం మెడులు వంచుతామని మంత్రులు హెచ్చరించా రు. కార్పొరేట్ కంపెనీలకు పెద్దఎత్తున ప్రొత్సాహకాలు అందిస్తున్న కేంద్రం రైతులకు ఎందుకు ఇవ్వదని ప్రశ్నిం చారు. దేశానికి అన్నం పెట్టే రైతులు అంటే బిజెపి ప్ర భుత్వానికి ఎందుకు అంత కడుపుమంట? అని నిలదీశా రు. వారికి చేయూత నివ్వడానికి మోడీ ప్రభుత్వానికి మనస్సు రాకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన రైతన్నలను జీవితాల ను ఆగం చేసి రోడ్డు మీద పడేయాలని చూస్తే మాత్రం సి ఎం కెసిఆరే స్వయంగా రంగంలోకి కేంద్రంపై ఆందోళన లకు పిలుపునిస్తారన్నారు. అప్పుడు కేంద్ర ప్రభు త్వాన్ని ఎవరు కాపాడలేరని మరింత ఘాటుగా హెచ్చ రించారు. గురువారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు మం త్రులు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు కేంద్రంపై తీవ్ర స్థా యిలో విరుచుకపడ్డారు.

మోడీజీ.. విధానాలను మార్చుకోండి

కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్ప డుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించా రు. ఎరువుల ధరలు పెంచి తీవ్ర ఇబ్బందులకు గురి చే స్తోందని మండిపడ్డారు. ఈ విధానాలను ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే మార్చుకోవాలన్నారు. లేనిపక్షంలో రైతుల ఆగ్రహంలో బిజెపి ప్రభుత్వం కొట్టుకపోతుందన్నారు. ఎంఎల్‌సిలు గంగాధర్‌గౌడ్, ఎల్. రమణ, దండే విఠల్, ఎంఎల్‌ఎ ముఠాగోపాల్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి మా ట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి రై తులను దగా చేస్తోందన్నారు. ఈ విధానాలపై దేశవ్యా ప్తంగా ఉద్యమం చేయాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమ న్నారు. పైగా ధరల పెంపును సమర్థించుకునేలా బిజెపి నేతలు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి ఎర్రబెల్లి విమ ర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అను బంధం చేయాలని కోరి ఐదేళ్లవుతున్నా కేంద్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానిం చారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిం రైతులను ఇ బ్బంది పెట్టేందుకు మరో రూపంలో తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన బిజెపి, కాంగ్రెస్ నా యకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టిడిపిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక వి ధానాలపై పోరాడిన ప్రస్తుత టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించా రు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కూడా సరిగా ఇవ్వలేక పోయిందన్నారు.

కార్పోరేటీకరణకు కేంద్రంప్రాధాన్యం

మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా కార్పొరే ట్ సంస్థలకు జేబు సంస్థగా పనిచేస్తోందని మంత్రి శ్రీని వాస్‌గౌడ్ ఆరోపించారు. లు సి. లక్ష్మారెడ్డి, గ ణేష్ గుప్తాలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాలు చూస్తుంటే అన్నీ ప్రైవేట్ పరం చేసేట్టుగా కనిపిస్తోందన్నా రు. అన్నం పెట్టే రైతన్నలకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలో ఉన్న భారతదేశంను వ్యవసాయం నుంచి తప్పి స్తారా ప్రశ్నించారు. దాకా కేంద్రం ధాన్యం కొనమన్నదన్నారు. ఇప్పుడేమో ఏకంగా వ్యవసాయమే వద్దంటున్నట్లుగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. క రెంటుకు మీటర్లు పెడతాఅంటారు… ఎరువుల ధరలను పెంచుతామంటారు. అయితే రైతు వ్యవసాయం ఎలా చేస్తాడని? ఆయన నిలదీశారు. అసలు కేంద్రానికి రైతును ఆదుకునే విధానం లేదా? అని మండిపడ్డారు. ఇబ్బంది పెట్టాలని చూస్తే ఇక్కడ కెసిఆర్ పిడికిలి బిగిస్తారని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.

రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టండి

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చేపడు తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టిఆర్ ఎస్ శ్రేణులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి ఏ డేళ్ల కాలంలో అన్నీ రైతు వ్యతిరేక విధానాలనే చేపట్టిం దని మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చే స్తామన్న మోడీ సర్కార్.. ఆదాయాన్ని మాత్ర మే రెండింతలు పెంచిందని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన విధానాల వల్లనే రాష్ట్రం లో రైతుల ఆదాయం పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు, డీజిల్,పెట్రోల్ ధర లతో రైతుల జేబుకు చిల్లు పడిందన్నారు. బాధ్యతాయు తమైన సిఎంగా, రైతు బాంధవ్యుడిగా రైతుల సమస్య ను కెసిఆర్ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తే…అందుకు సమాధానం చెప్పాల్సిన ప్రధాని మౌనంగా ఉండడం ఎంతమాత్రం సమంజసంగా లేదన్నారు. సిఎం కెసిఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలసింది ముమ్మా టికీ కేంద్రమేనని అన్నారు. ప్రభుత్వం పెంచిన ఎరువులు, డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గించే దాకా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం, టి ఆర్ యస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News