Tuesday, January 21, 2025

అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు ఇస్తాం.. కేబినెట్ లో కీలక నిర్ణయాలు

- Advertisement -
- Advertisement -

తెల్లరేషన్ కార్డులు లేక ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్న వారికి కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అర్హులైనవారందరికీ తెల్లరేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం సచివాలయంలో రాష్ట్రమంత్రి వర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. అనంతరం మీడియా ద్వారా కేబినేట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలను  మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు వివరించారు. 16 కొత్త కార్పొరేషన్లు, హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్దరణ, మహిళా సంఘాలకు రూ.10లక్షల వరకు బీమా, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మహిళా రైతు బజార్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త తెల్లరేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు.

ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. తొలి విడుతలో మొత్తం నాలుగున్న లక్షల ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు కోసం రూ.22,500కోట్ల నిధులు విడుదల చేశామని తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. బిసి, ఎస్సి, ఎస్సి కులాలకు కొత్త కార్పొరేషన్లు, డిఎస్సి 2008 అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలో కమిటి ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ అక్రమాలపై విచారణకు రిటైర్డ్ జడ్జీ నరసింహారెడ్డితో కమిటీ ఏర్పాటు. వంద రోజుల్లో విచారణను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.మరో రెండు రోజుల్లో రైతు బంధు వేస్తామని మంత్రులు స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News