మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: ‘ప్రపంచ స్థా యిలో ఎన్నో పథకాలకు తెలంగాణ రాష్ట్రం ఒక ప్రయోగశాల. తెలంగాణ వచ్చే వరకూ రామప్పకు గుర్తింపు రాలేదు. టూరిజం హబ్‌గా చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. భూసేకరణకు రైతులు సహకరించాలి’ అని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతిరాథోడ్ అన్నారు. ములుగు జిల్లా వెం కటాపురం మండలం పాలంపేట గ్రామంలో కొలువైన రుద్రేశ్వర స్వామి దేవాలయం రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో మంత్రులతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌ఎ సీతక్కలు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామప్ప దేవాలయం ప్రాంగణంలో మొక్క లు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి గౌడ్ మాట్లాడుతూ.. వేల సంవత్సరాల నుంచి ఉన్న వారసత్వ చరిత్ర గల ఈ ప్రాంతం తెలంగాణ వచ్చేంత వరకూ గుర్తింపునకు నోచుకోలేదన్నారు. 21 దేశాలు కలిసి రామప్ప గుర్తింపునకు సహకారం ఇచ్చారని అన్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రామప్పను సందర్శించి ఇంకా ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రణాళికలు తయారు చేయాలని సూచించినట్లు చెప్పారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నాయకులను కోరుతున్నానని, వేయి గుడి నుంచి వరంగల్ పోర్ట్ తదితర ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయని అన్నారు.
హైదరాబాద్ తర్వాత వరంగలే
హైదరాబాద్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా ముందు ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్ రావు అన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో ప్రపంచ స్థాయిలో ఖ్యాతి వచ్చిందని పేర్కొ న్నారు. ముఖ్యమంత్రి కృషితో చాలామంది దీని వెనక ఉన్నారని, ఎంపిలు పాండురంగా రావు చేసి న కృషి కీలకమన్నారు. రామప్పను టూరిజం హబ్‌గా చేసేందుకు స్థానికుల సహకారం అవసరం అని, భూసేకరణకు 27ఎకరాలు ఉందని, మిగిలిన భూమికి రైతులు సహకరించాలని కోరారు.
సిఎం కెసిఆర్‌తోనే ఆలయాల అభివృద్ధి
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో సిఎం కెసిఆర్‌తోనే ఆలయాల అభివృద్ధి జరుగుతుందని, రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడి కళలు, శిల్ప నైపుణ్యంపై ముఖ్యమంత్రికి ఉన్న పట్టు ఎవరికి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జల సంఘం చైర్మన్ వీరమల్ల ప్రకాశ్‌రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ పార్లమెంట్ సభ్యుడు సీతారాం నాయక్, టూరిజం సెక్రటరీ శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, డిఆర్‌ఒ రమాదేవి, స్థానిక సర్పంచ్ డోలి రజిత, ములుగు, వెంక టాపూర్ జడ్‌పిటిసిలు సకినాల భవాని, గైరుద్రమదేవి, ఎంపిటిసిలు, రామప్ప ఇఒ బిల్లా శ్రీనివాస్, తహసీల్దార్ మంజుల, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Telangana Ministers visit Ramappa Temple