Monday, December 23, 2024

ఫలించిన భగీరథ యత్నం

- Advertisement -
- Advertisement -

కోటి 35 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం
ప్రాజెక్టులపైన రూ.1.61 లక్షల కోట్లు వ్యయం
60శాతం పైగా ఉన్న గ్రామీణ జనాభా ఉపాధికి భరోసా

మన తెలంగాణ/హైదరాబాద్: భగీరధ తపస్సు ఫలించింది. పాక్షిక మెట్ట ప్రాంతంలో ఉన్న తెలంగాణలో సరికొత్త జలదృష్యం ఆవిష్కృతమైంది. కోటి ఎకరాల మాగాణం.. నా తెలంగాణం అన్న లక్షంతో ముఖ్యమంత్రి కేసిఆర్ తలపెట్టిన బంగారు తెలంగాణ కళ్లముందు సాక్షాత్కరిస్తోంది. నమ్మకమైన నీటిపారుదల సౌకర్యాలు పంటలకు ప్రధాన ఉత్పాదకం . ఇది వ్యవసాయరంగంపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులను బలహీన రుతుపవనాలపైన ఆధారపడకుం డా కాపాడుతుంది. దీనివల్ల ఉపరితల నీటి పారుదల, నీటి వినియోగపు సామర్ధం పెరగటమే కాకుండా పంటల ఉత్పత్తి , ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం,తద్వారా పన్నుల రూపంలో ప్రభుత్వరాబడులు పెరుగుతాయి.

ఈ లక్షసాధనలో భాగంగానే రాష్ట్రంలో నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధిని బలోపేతం చేయడంతో అపారమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రంలో గరిష్ట నీటిపారుదల పరిధిని పెంచడానికి ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అవలంబించింది. మిషన్‌కాకతీయ ఆశించిన దానికంటే అధికంగానే ఫలితాలను అందిస్తోంది. నీళ్లు నిధులు నియామకాలే లక్షంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో 2014నుంచి 2022-23వరకూ కేసిఆర్ సర్కారు నీటిపారుదల రంగంపైన రూ.1,60,979కోట్లు వెచ్చించింది. కృష్ణా, గోదావరి నదీజలాల ఆధారంగా కాళేశ్వరం , పాలమూరు-రంగారెడ్డి వంటి బృహత్తర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టింది.

ఇందులో ఇప్పటికే పలు ్రప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసింది. కోటి 35 లక్షల ఎరరాలకు సాగునీటి సదుపాయాలు కల్పించే చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 62.48 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీటి సదుపాయం ఉండేది. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో కేసిఆర్ సర్కారు నీటిపారుదల రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.25లక్షల ఎకరాలు , సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 3.87లక్షల ఎకరాలు, చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు ద్వారా 5.58లక్షల ఎకరాలు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ద్వారా 2.03లక్షల ఎకరాలు, మహాత్మాగాంధీ కల్వకుర్తి పథకం ద్వారా 4.24లక్షల ఎకరాలు, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 2లక్షల ఎకరాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 12.30లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలన్న లక్షంతో పనులు చేపట్టింది.

ఇందులో ఇప్పటికే పలు ప్రాజెక్టులు పూర్తికాగా, మరికొన్నింటిద్వారా పాక్షిక ప్రయోజనాలు అందుతున్నాయి. మిషన్ కాకతీయ కింద మీడియం ఇరిగేషన్ ట్యాంకుల పునరుద్దరణ చర్యలు సత్వర ఫలితాలను ఇచ్చాయి. రాష్ట్రంలో రూ.5,349 కోట్ల వ్యయంతో 27,472 చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. 15.05 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. చెరువుల్లో నీటినిలువ సామర్ధాన్ని 8.93టిఎంసీలకు పునరుద్దరించారు. నీటిపారుదల ప్రాజెక్టుల వినియోగంలో కూడా మెరుగైన చర్యలు చేపట్టారు. ఖచ్చితమైన నీటి సరఫరా లేకపోవడం వలన ఐపి వినియోగం చాల తక్కువగా ఉండేది. 57.86లక్షల ఎకరాలకు గాను 20లక్షల ఎకరాలకు మాత్రమే నీటిపారుదల వినియోగం వుండేది.

వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, లిఫ్టులు, పునరుద్దరణ కారణంగా భారీ నీటి ట్యాంకులు ,చెక్‌డ్యామ్‌ల ద్వారా నీటిపారుదల వినియోగం 2020-21నాటికే 95.97లక్షల ఎకరాలకు పెరిగింది. ప్రభుత్వ కృషి ఫలితంగా గత ఆరేళ్లలో భూగర్భ జల మట్టాల్లో కూడా 4.14మీటర్లు వృద్ధి కనిపించింది. నీటిపారుదల రంగంలో ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో 74.32లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీటిపారుదల సామర్ధం పెరిగింది. 2014-15లో కేవలం 62.48 లక్షల ఎకరాలకు మాత్రమే ఉన్న సాగునీటి సదుపాయం ఎనిమిదేళ్లలో అంచెలంచెలుగా పెరుగుతూ కోటి 35లక్షల ఎకరాలకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News