Saturday, September 28, 2024

ఎంఎల్ఏ హరీశ్ రావు సిద్దిపేట్ కార్యాలయం ధ్వంసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రస్తుత బిఆర్ఎస్ ఎంఎల్ఏ, మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట కార్యాలయాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అది కూడా శనివారం తెల్లవారు జామున. ఈ దాడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పనే అని బిఆర్ఎస్ నిందిస్తోంది.

పంట రుణాల మాఫీ చేసినందున హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీ బ్యానర్లను కూడా టౌన్ లో ఏర్పాటు చేశారని వార్త. ఇదివరలో పంట రుణమాఫీ చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలు విసిరారన్నది ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

హరీశ్ రావు మద్దతుదారులు శుక్రవారం రాత్రి ఫ్లెక్సీ బ్యానర్లను తొలగించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ వర్గం వారు నినాదాలు చేస్తూ ఒకరిపై మరొకరు విరుచుకుపడడంతో పోలీసులు కలుగజేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హరీశ్ రావు కార్యాలయంలోకి చొరబడి బ్యానర్లను చించేసి, విధ్వంసం సృష్టించారు. పైగా ‘జై కాంగ్రెస్’ అంటూ నినాదాలు చేశారని సమాచారం. ఈ ఘటనను హరీశ్ రావు ఖండించారు. ‘పోలీసులు దాడిని నివారించడానికి బదులు, విశృంఖలానికి పాల్పడిన వారికి రక్షణ నిచ్చారు’ అని హరీశ్ రావు ‘ఎక్స్’ పోస్ట్ లో విమర్శించారు. డిజిపి ఈ ఘటనలో చర్యలు తీసుకోవాలని కూడా హరీశ్ రావు కోరారు. కాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఇది పిరికిపంద చర్య అంటూ ఆ ఘటనను ఖండించారు. ‘ఇదేనా రాహుల్ గాంధీ మొహబ్బత్ కీ దుకాణ్’ అని విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News