Tuesday, November 5, 2024

ఓట్ల లెక్కింపునకు భారీ బందోబస్తు

- Advertisement -
- Advertisement -

Telangana MLC Elections Results 2021

మూడంచెల భద్రత ఏర్పాట్లు
1,200మంది పోలీసులతో భద్రత
పర్యవేక్షించిన రాచకొండ సిపి మహేష్ భగవత్

హైదరాబాద్: పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాచకొండ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నగరంలోని ఓట్ల లెక్కింపును సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి 1,200మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగనుండడంతో చివరి వరకు భద్రత ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈవిఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ చేపట్టడంతో లెక్కించేందుకు చాలా సమయం తీసుకోనున్నారు. దాదాపుగా రెండు రోజులు ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఓట్ల లెక్కింపు జరిగే సరూర్‌నగర్ స్టేడియంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపును సిసి కెమెరాల పర్యవేక్షణలో కొనసాగించనున్నారు. పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లకు ఇప్పటికే ఐడి కార్డులను అందజేశారు.

అనుమతి ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోని పంపనున్నారు. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల్లో 144 సెక్షన్ విధించారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది ప్రజలు ఒకే చోట గుమిగూడితే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా జిహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్ చేశారు. ఇది ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కొనసాగనుంది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే తనకు తెలపాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News