Monday, March 10, 2025

బుద్ధులు చెప్పే ‘పెద్దలు’ రావాలి!

- Advertisement -
- Advertisement -

ఉపాధ్యాయ వృత్తి భావి భారత పౌరులను తీర్చిదిద్ద వలసిన గురుతర బాధ్యత కలిగినది. ఇతరులకు ఆదర్శంగా ఉండవలసిన ఉపాధ్యాయు లలో కొందరు డబ్బు తీసుకొని ఓటు వేయడం అనేది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు దేశం అంతటా ఆందోళన కలిగించవలసిన విషయం. ప్రజాస్వామ్యం ఎటువంటి ప్రమాదంలో ఉన్నదో
ఆలోచించుకోవాల్సిన విషయం. నిజాని కి ఉపాధ్యాయుల, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి శాసనమండలికి ఎన్నికయ్యే ప్రతినిధులు ఒక రాజకీయ పక్షానికి చెందిన వారయి ఉండకపోవడం అనేది చాలా
అవసరం. గతంలో ఇట్లా జరుగుతూ ఉండేది. ఉపాధ్యాయుల
ప్రతినిధులు శాసనమండలిలో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన
సమస్యల మీద, విద్యారంగానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడి ప్రభుత్వాల చేత పరిస్థితుల్ని సరి చేయించగలిగేంత శక్తి
కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజకీయ పక్షాలు
అధికారికంగానే ఈ నియోజకవర్గాల్లో తమ ప్రతినిధుల నిలబెట్టడం,
ఏం చేసి అయినా సరే వారిని గెలిపించుకోవడం చూస్తున్నాం.

గవర్నర్ కోటాలో శాసనమండలికి వచ్చేవాళ్ళ పరిస్థితి అందరికీ తెలుసు. ఎన్నికలలో నిలబడి పోటీచేసి గెలిచి రాలేని మేధావులు, కళాకారులు, వివిధ రంగాల
నిపుణులను గవర్నర్ కోటా కింద శాసనమండలికి పంపాల్సి ఉంటుంది. కానీ, ఫక్తు రాజకీయ నాయకులే ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఆక్రమించుకుంటున్న పరిస్థితి మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఎవరు
అధికారంలో ఉంటే వారు తమ రాజకీయాలను సమర్థిస్తున్న వారిని లేదా తమ రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉన్న వాళ్లను గవర్నర్ కోటా ద్వారా పెద్దల సభకు పంపించి శాసనమండలిని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేసిన విషయం మనకు తెలుసు.

తెలంగాణ రాష్ట్రంలో పెద్దల సభ (శాసన మండలి )కు సంబంధించిన మూడు నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయి. అందులో ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం అయితే మరో రెండు ఉపాధ్యాయ ప్రతినిధులను ఎన్నుకునే నియోజకవర్గాలు. పెద్దల సభకు వెళ్లేవాళ్లు సుద్దులు చెప్పే వాళ్ళు అయి ఉండాలి. సుద్దులు చెప్పడం అంటే మంచి నేర్పగలగడం అనే అర్థంలో తీసుకోవాలి. అందులోనూ పట్టభద్రుల ప్రతినిధులుగా వెళ్లేవాళ్లు మరీ ముఖ్యంగా ఉపాధ్యాయ ప్రతినిధులుగా వెళ్ళేవాళ్ళు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. శాసనసభ చేసే నిర్ణయాలను కూడా పునః సమీక్షించే ఈ పెద్దల సభకు జరిగిన మూడు నియోజకవర్గాలలో రాజకీయాలు, రాజకీయ పార్టీలు వాటి పనితీరు, వెలువడిన ఫలితాల వల్ల ఏ రాజకీయ పక్షానికీ ఎటువంటి లాభం జరుగుతుంది, నష్టం జరుగుతుంది వంటి విషయాలు ఎట్లాగూ మాట్లాడుకుంటాం. వాటికంటే ముందు మాట్లాడుకోవాల్సింది, అత్యంత ముఖ్యమైనది ఆ సభలకు వెళుతున్న ప్రతినిధులు ఎన్నికైన తీరు.

ఇక్కడ వ్యక్తుల గురించిన వ్యక్తిగత వ్యవహార శైలి, వాళ్ళ నడవడి లేదా వాళ్ళ క్యారెక్టర్ గురించి కాదు ఎన్నికలు జరిగిన తీరును గురించి మాట్లాడుకుంటున్నాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం పట్టభద్రుల నియోజకవర్గంలో మాత్రమే అధికారికంగా తన అభ్యర్థిని పోటీకి నిలబెట్టింది. తెలంగాణలో అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ మూడు నియోజకవర్గాల్లో కూడా తన అభ్యర్థులను నిలబెట్టింది. పదేళ్లపాటు అధికారంలో ఉండిన భారత రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో అసలు అభ్యర్ధులను పోటీకి పెట్టలేదు. ఈ మూడు శాసనమండలి స్థానాల ఫలితాల రాజకీయ పర్యవసానం ఎట్లా ఉంటుంది అనే విషయం చర్చించడాని కంటే ముందుగా ఎన్నికలు జరిగిన తీరు, ఇందులో ప్రధానంగా డబ్బు పంపిణీ గురించి మాట్లాడుకోవాలి. ఎవరికి ఎవరు తీసిపోకుండా ప్రధాన అభ్యర్థులందరూ విపరీతంగా డబ్బు పంచడం బహిరంగ రహస్యం. శాసనమండలి సభ్యుడి ఎన్నికకు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అందులోనూ ఆరంభంలో చెప్పుకున్నట్టు బుద్ధి జీవులు ఎన్నుకునే నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారం ఇది.

ఉపాధ్యాయ వృత్తి భావి భారత పౌరులను తీర్చిదిద్దవలసిన గురుతర బాధ్యత కలిగినది. ఇతరులకు ఆదర్శంగా ఉండవలసిన ఉపాధ్యాయులలో కొందరు డబ్బు తీసుకొని ఓటు వేయడం అనేది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు దేశం అంతటా ఆందోళన కలిగించవలసిన విషయం. ప్రజాస్వామ్యం ఎటువంటి ప్రమాదంలో ఉన్నదో ఆలోచించుకోవాల్సిన విషయం. నిజానికి ఉపాధ్యాయుల, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి శాసనమండలికి ఎన్నికయ్యే ప్రతినిధులు ఒక రాజకీయ పక్షానికి చెందిన వారయి ఉండకపోవడం అనేది చాలా అవసరం. గతంలో ఇట్లా జరుగుతూ ఉండేది. ఉపాధ్యాయుల ప్రతినిధులు శాసనమండలిలో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన సమస్యల మీద, విద్యారంగానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడి ప్రభుత్వాల చేత పరిస్థితుల్ని సరి చేయించగలిగేంత శక్తి కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజకీయ పక్షాలు అధికారికంగానే ఈ నియోజకవర్గాల్లో తమ ప్రతినిధుల నిలబెట్టడం, ఏం చేసి అయినా సరే వారిని గెలిపించుకోవడం చూస్తున్నాం. ఎన్నికల సమయంలో మేము ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల మీద మండలిలో పోరాటం చేస్తాం, పరిష్కారాలు సాధిస్తామని చెప్పిన రాజకీయపక్షాల ప్రతినిధులుగా ఉన్నంతకాలం వాళ్లకు ఉండే పరిమితులు మనందరికీ తెలుసు. శాసనమండలికి శాసనసభ నుంచి కొంత మంది ప్రతినిధులను,

స్థానిక సంస్థల నుంచి కొంతమంది ప్రతినిధులను, ఉపాధ్యాయ వర్గాల నుండి కొంతమందిని, పట్టభద్రులను నుండి కొంతమందిని ఎన్నుకోవడమే కాకుండా గవర్నర్ నియమించే వారు కూడా కొద్దిమంది ఉంటారు. గవర్నర్ కోటాలో శాసనమండలికి వచ్చేవాళ్ళ పరిస్థితి అందరికీ తెలుసు. ఎవరైతే ఎన్నికలలో నిలబడి పోటీచేసి గెలిచి రాలేని వర్గాల వారు ఉంటారో వారిని, ఉదాహరణకు మేధావులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు వారి వారి రంగాలలో సాధించిన నైపుణ్యానికి గుర్తుగా గవర్నర్ కోటా శాసనమండలి సభ్యులను పంపాల్సి ఉంటుంది. కానీ ఫక్తు రాజకీయ నాయకులే ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఆక్రమించుకుంటున్న పరిస్థితి మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఎవరు అధికారంలో ఉంటే వారు తమ రాజకీయాలను సమర్థిస్తున్న వారిని లేదా తమ రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉన్న వాళ్లను గవర్నర్ కోటా ద్వారా పెద్దల సభకు పంపించి శాసనమండలిని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేసిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ వాతావరణంలో పట్టభద్రుల స్థానాల నుంచి, ఉపాధ్యాయ వర్గాల స్థానాల నుంచి ఎన్నికై వస్తున్న రాజకీయ పక్షాల నాయకులను గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు,

మాట్లాడుకుని ప్రయోజనం కూడా లేదు. ఇక రాజకీయాలను గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఇంత ఉత్సాహకరమైన వాతావరణం గతంలో ఎప్పుడూ లేదని చెప్పుకోవాలి. తాజాగా ముగిసిన శాసనమండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలతో గెలిచిన ఈ రెండు స్థానాలతో కలుపుకొని ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు, మరో ఎనిమిది మంది శాసనసభ్యులు, ముగ్గురు శాసనమండలి సభ్యులు ఉన్నారు. ఇది గతంలో ఎప్పుడు లేని విశేషం. బహుశా అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇరువురు మొన్న గెలిచిన ఇద్దరు శాసనమండలి సభ్యులనూ స్వయంగా అభినందించారు. దక్షిణాదిలో అధికారంలోకి రావాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు తెలంగాణలో కొత్త శక్తి చేకూరినట్టు భావించాలని విశ్లేషకుల వాదన.

ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రెండు జాతీయ పార్టీలు. తెలంగాణలో అధికారంలో ఉండే అర్హత తమకే ఉందని చెప్పుకోవడానికి కారణం ఉంది. సుదీర్ఘ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఇచ్చింది కాంగ్రెస్ అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి బలంగా దాన్ని సమర్ధించింది భారతీయ జనతా పార్టీ. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ కంటే చాలా ముందే కాకినాడలో బిజెపి ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో బయలుదేరింది. దాని జాతీయ పార్టీ కూడా మద్దతుగా నిలిచింది, కాబట్టి మిగిలిన అన్ని దక్షిణాది రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బిజెపి భావించడంలో తప్పేం లేదు.
నిజానికి రాష్ట్ర విభజన వల్ల నష్టం జరిగిందని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా ఉన్నది. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఉన్న ఊపు ఇట్లా కొనసాగుతుందా మరింత పెరుగుతుందా లేక తగ్గుతుందా అనే విషయం వేచి చూడాల్సిందే. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, అధికారంలో ఉన్న పార్టీ పట్టభద్రుల స్థానం కోల్పోయింది అంటే ప్రజల్లో ముఖ్యంగా విద్యావంతుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది అని ఒక వాదన.

ఫలితాలు వెలువడిన నాటి నుండి ఎందుకంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న ఉత్తర తెలంగాణలోని పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానం నిన్నటి దాకా కాంగ్రెస్ ది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. నిజానికి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా ఆ స్థానాన్ని అప్పట్లో గెలుచుకుంది. ఆయన పదవీకాలం ముగిసిపోవడంతో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికార కాంగ్రెస్‌ను ఓడించి గెలిచింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందని, అధికార పక్షానికి వ్యతిరేకంగా త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితి ఉండబోతుంది అని అంచనాలు కూడా వేస్తున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం ఒక సంవత్సరం మీద మూడు మాసాలు మాత్రమే అయింది. ఇంకా దాదాపు నాలుగు సంవత్సరాల పదవీకాలం ఉండగా ఇప్పటినుండే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదనో, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనో మాట్లాడుకోవడం జోస్యాలు చెప్పడం అవుతుంది. లేదా ఆంగ్లంలో చెప్పాలంటే అది కాంగ్రెస్ అంటే గిట్టని వారి విష్‌ఫుల్ థింకింగ్ అనుకోవాలి. ఏదిఏమైనా భారతీయ జనతా పార్టీ ఈ మేరకు బలపడటానికి పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న

భారత రాష్ట్ర సమితి చేసిన తప్పిదాలే కారణం అనడంలో సందేహం లేదు. 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత భారత రాష్ట్ర సమితి తాను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకినని స్వతంత్రంగానే ఉంటానని ప్రజలను నమ్మించడంలో పూర్తిగా విఫలమైందనడంలో సందేహం లేదు. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కుమార్తె, మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితురాలుగా జైలుకు వెళ్లడం, కెటి రామారావు మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసుల్లో బాధ్యుడిగా ఉన్నాడని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడం, దానిమీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కూడా దృష్టి పెట్టడం ఇలాంటివి భారత రాష్ట్ర సమితి బిజెపి వ్యతిరేకతను బలంగా ప్రదర్శించలేకపోవడానికి కారణం అన్నప్రచారం బలంగా ఉంది. ప్రస్తుత ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారత రాష్ట్ర సమితి పోటీ చేయకపోవడానికి కారణం బిజెపికి లాభం చేయడమేనని, గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా భారత రాష్ట్ర సమితి ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీకి లాభం చేయడం కోసం తాను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యంగా మారడమేనని విమర్శ కూడా ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పోటీ చేసిన ఒక్క గ్రాడ్యుయేట్స్ స్థానం కోల్పోయిన కారణంగా ముఖ్యమంత్రినే మార్చేస్తారు అనేంత దూరం రేవంత్ రెడ్డి వ్యతిరేకులు పోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అప్పుడే ఎవరు ముఖ్యమంత్రి అనే చర్చ,

ఊహాగానాలు కూడా జోరుగా సాగుతున్నాయి. గత అనుభవాల నుంచి ఏ మాత్రం గుణపాఠాలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ అటువంటి తప్పిదం ఇప్పుడు అప్పుడే చేస్తుందని ఎవరు అనుకోరు. గతంలో తరచూ ముఖ్యమంత్రులను మార్చిన కారణంగా జరిగిన నష్టం ఏమిటో కాంగ్రెస్ అధిష్టానవర్గానికి బాగా తెలుసు. 1978 తర్వాత కాంగ్రెస్ 2004 వరకు కూడా రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నిలబెట్టుకోలేకపోవడానికి కారణం తరచూ ముఖ్యమంత్రిని మార్చడం. మొదటిసారి నలుగురిని, తర్వాత కాలంలో ముగ్గురిని ముఖ్యమంత్రులను మార్చి ప్రజల్లో అప్రతిష్ట కొనితెచ్చుకొని, ఒక రకంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి కారణమైంది. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తరచూ ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానవర్గం విరమించుకున్నదని చెప్పాలి. ఇప్పుడు కూడా పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అక్కడ చాలా రోజులుగా, ఆ మాటకొస్తే ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన మరునాటి నుంచే సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవినుంచి తొలగించి డికె శివకుమార్‌ను ఆ పదవిలో కూర్చోబెడతారని ఊహాగానాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. గత అనుభవాల నుండి పాఠాల్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్టు ఉంది. తరచూ ముఖ్య మంత్రులను మారిస్తే ఎల్లకాలం అధికారంలో ఉంటామని భావిస్తే పప్పులో కాలేసినట్టే. ఆ తప్పు కాంగ్రెస్ గ్రహించినట్టే కనిపిస్తున్నది.

ఉపాధ్యాయ వృత్తి భావి భారత పౌరులను తీర్చిదిద్ద వలసిన గురుతర బాధ్యత కలిగినది. ఇతరులకు ఆదర్శంగా ఉండవలసిన ఉపాధ్యాయులలో కొందరు డబ్బు తీసుకొని ఓటు వేయడం అనేది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు దేశం అంతటా ఆందోళన కలి గించవలసి న విషయం. ప్రజాస్వామ్యం ఎటువంటి ప్రమాదం లో ఉన్నదో ఆలోచించుకోవాల్సిన విషయం. నిజాని కి ఉపాధ్యాయుల, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి శాసనమండలికి ఎన్నికయ్యే ప్రతినిధులు ఒక రాజకీయ పక్షానికి చెందిన వారయి ఉండకపోవడం అనేది చాలా అవసరం. గతంలో ఇట్లా జరుగుతూ ఉండేది. ఉపాధ్యాయుల ప్రతిని ధులు శాసనమండలి లో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన సమస్యల మీద, విద్యారంగానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడి ప్రభుత్వాల చేత పరిస్థితుల్ని సరి చేయించగలిగేంత శక్తి కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజకీయ పక్షాలు అధికారికంగానే ఈ నియోజకవర్గాల్లో తమ ప్రతినిధుల నిలబెట్టడం, ఏం చేసి అయినా సరే వారిని గెలిపించుకోవడం చూస్తున్నాం.

శాసనమండలికి శాసనసభ నుంచి కొంత మంది ప్రతినిధుల ను, స్థానిక సంస్థల నుంచి కొంతమంది ప్రతినిధులను, ఉపాధ్యాయ వర్గాల నుండి కొంతమందిని, పట్టభద్రులను నుండి కొంతమందిని ఎన్నుకోవడమే కాకుండా గవర్నర్ నియమించే వారు కూడా కొద్దిమంది ఉంటారు. గవర్నర్ కోటాలో శాసనమండలికి వచ్చేవాళ్ళ పరిస్థితి అందరికీ తెలుసు. ఎవరైతే ఎన్నికలలో నిలబడి పోటీచేసి గెలిచి రాలేని వర్గాల వారు ఉంటారో వారిని, ఉదాహరణకు మేధావులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు వారి వారి రంగాలలో సాధించిన నైపుణ్యానికి గుర్తుగా గవర్నర్ కోటా శాసనమండలి సభ్యులను పంపాల్సి ఉంటుంది. కానీ ఫక్తు రాజకీయ నాయకులే ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఆక్రమించుకుంటున్న పరిస్థితి మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఎవరు అధికారంలో ఉంటే వారు తమ రాజకీయాలను సమర్థిస్తున్న వారిని లేదా తమ రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉన్న వాళ్లను గవర్నర్ కోటా ద్వారా పెద్దల సభకు పంపించి శాసనమండలిని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేసిన విషయం మనకు తెలుసు.

ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పోటీ చేసిన ఒక్క గ్రాడ్యుయేట్స్ స్థానం కోల్పోయిన కారణంగా ముఖ్యమం త్రినే మార్చేస్తారు అనేంత దూరం రేవంత్ రెడ్డి వ్యతిరేకులు పోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అప్పుడే ఎవరు ముఖ్యమంత్రి అనే చర్చ, ఊహాగానాలు కూడా జోరుగా సాగుతున్నాయి. గత అనుభవాల నుంచి ఏ మాత్రం గుణపాఠాలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ అటువంటి తప్పిదం ఇప్పుడు అప్పుడే చేస్తుందని ఎవరు అనుకోరు. గతంలో తరచూ ముఖ్యమంత్రులను మార్చిన కారణంగా జరిగిన నష్టం ఏమిటో కాంగ్రెస్ అధిష్టానవర్గానికి బాగా తెలుసు. 1978 తర్వాత కాంగ్రెస్ 2004 వరకు కూడా రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నిలబెట్టుకోలేకపో వడానికి కారణం తరచూ ముఖ్యమంత్రిని మార్చడం. మొదటిసారి నలుగురిని, తర్వాత కాలంలో ముగ్గురిని ముఖ్యమంత్రులను మార్చి ప్రజల్లో అప్రతిష్ట కొనితెచ్చుకొ ని, ఒక రకంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి కారణమైంది. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తరచూ ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానవర్గం విరమించుకున్నదని చెప్పాలి.

amar devulapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News