Thursday, January 23, 2025

తెలంగాణ మాదిరి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -
బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ బడ్జెట్‌లో రెండు లక్షల కోట్లకు కేటాయించాలి
జాతీయ బిసి కమిషన్ చైర్మన్‌కు బిసి నేతల వినతి

హైదరాబాద్ : తెలంగాణ, ఎపి మాదిరిగా దేశవ్యాప్తంగా పథకాలు అమలు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ముఖ్యంగా హాస్టళ్ళు -, గురుకుల పాఠశాలల పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ పథకాలు దేశమంతటా అమలు చెయ్యాలని, ఇందుకు రాజ్యాంగ బద్ద సంస్థగా కేంద్రానికి సిఫార్స్ చెయ్యాలని జాతీయ బిసి కమిషన్‌కు బిసి నేతలు విజ్ఞప్తి చేశారు. ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బిసి సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, నందగోపాల్, కర్రీ వేణుమాధవ్, రాజ్ కుమార్, జోషి రాఘవ, భాషయ్య తదితరులు జాతీయ బిసి కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారాంను ఢిల్లీలో లో కలిసి వినతిపత్రం సమర్పించారు.

కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బిసిల సంక్షేమానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాజ్యాంగ బద్దమైన సంస్థగా జాతీయ బి.సి కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన 56 శాతం జనాభా గల బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ కులాల అభివృద్ధి జరగడం లేదని అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలున్నాయని, బిసిలకు మాత్రమే మంత్రిత్వ శాఖ లేకపోవడం అన్యాయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 75 కోట్ల మంది బిసిలకు 2 వేల కోట్లు కేటాయించి 56 శాతం జనాభా ను అవమానించారని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ బిసి అభివృద్ధికి 40 సిఫార్సులు చేస్తే అందులో ఆర్థికాభివృద్ధికి 16 సిఫార్సులు చేశారని, కాని ఇంతవరకు ఒక్క సిఫార్సు కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బిసిలకు విద్యా ఉద్యోగ రంగాలలో 27 శాతం రిజర్వేషన్లు పెట్టారని, వీటికి అనుబంధంగా ఆర్థికపరమైన రాయితీలు స్కాలర్ షిప్ లు, ఫీజు రియింబర్స్ మెంట్ మంజూరు, హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, మంజూరుకు బడ్జెట్ కేటాయించడం లేదని కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రత్యేక హాస్టళ్ళు – విద్యా సంస్థలు లేకపోతే బిసిలు ఎలా చదువుకుంటారని ఆయన ప్రశ్నించారు.

ఐఐటి, ఐఐఎం, – నీట్ లాంటి ముఖ్యమైన కోర్సులు చదివే బిసి విద్యార్థులకు ఈ కోర్సుల ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు. విద్యా రంగానికి అత్యంత ప్రాదాన్యత నిచ్చి ఉచిత విద్యా 3వ తరగతి నుండి పి.జి వరకు అందిస్తున్నాయని, ముఖ్యంగా 6వేల హాస్టళ్ళు, 1500 గురుకుల పాఠశాలలో 24 లక్షల మందికి ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారని బిసి కమిషన్ దృష్టికి తీసుకెళ్ళారు. 30 లక్షల మంది కాలేజీ విద్యార్ధుల ఫీజు రియింబర్స్ మెంట్ అమలు చేస్తున్నారన్నారు. యాంత్రీకరణ కారణంగా కులవృత్తులు – చేతివృత్తులు దెబ్బతిన్నాయని దీంతో ఈ కుల వృత్తుల వారు వృత్తులు కోల్పోయి ఆకలి చావులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుండి 50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. రాజీవ్ ఫెలో షిప్ పథకం కింద అర్హులైన పిహెచ్‌డి స్కాలర్స్ అందరికీ స్టై ఫండు మంజూరు చేయాలని, గురుకులపాఠశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు బడ్జెట్ కేటాయించాలని కోరారు. పారిశ్రామిక పాలసీలలో, కాంట్రాక్టుల కేటాయింపులో బిసిలకు 50 శాతం కోటా ఇవ్వాలని కోరారు. తెలంగాణ, ఎపి ప్రభుత్వాలు అమలు చేసే బిసి పథకాలకు 60 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కోరారు. కేంద్రానికి సిఫార్సు చేస్తామని హామీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News