Sunday, December 22, 2024

కర్నాటకలో మన జెండా ఎగరాలి: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana a role model for entire country: CM KCR

హైదరాబాద్: టిఆర్‌ఎస్‌ను, బిఆర్ఎస్ గా పేరు మారుస్తూ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. భార‌త్ రాష్ట్ర స‌మితిగా జాతీయ పార్టీని కెసిఆర్ బుధవారం ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…  కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయిందని విమర్శించారు. తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాలని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ కంటే వెనకపడటం ఏంటి? అని ప్రశ్నించారు. కర్నాటకలో బిఆర్ఎస్ జెండా ఎగరాలన్నారు. అఖిలేష్ ను ఈ సమావేశానికి రావొద్దని చెప్పాం. ములాయం ఐసియూలో ఉన్నారు అందరూ కలిసి వస్తారని పేర్కొన్నారు. దేశంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు పోతామని స్పష్టం చేశారు. దేశ ప్రజల కోసమే బిఆర్ఎస్ అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News