హైదరాబాద్: దేశానికి బువ్వ పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. బడంగ్ పేట్, మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో శనివారం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశం ఎకానమీలో తెలంగాణ 5వ స్థానంలో ఉందని, తెలంగాణకు సహకరించకుండా కేంద్ర మోకాలడ్డుతోందని దుయ్యబట్టారు. గత ఏడేన్నరేళ్లుగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. దమ్ముంటే తెలంగాణకు ఏం చేశారో బిజెపి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ అభివృద్ధి ఆపలేరన్నారు. ప్రభుత్వాస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రైతు బంధు 11 రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతుబంధును కాపీ కొట్టారన్నారు.