- Advertisement -
హైదరాబాద్: సచివాలయంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎంఎల్‌సి కవిత డిమాండ్ చేశారు. సచివాలయం ప్రాంగణంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై ఎంఎల్‌సి కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం సభలో లేవనెత్తడానికి మండలి చైర్మన్ అనుమతి ఇవ్వాలని కవిత కోరారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని సూచించారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్‌గాంధీ పట్ల తమకు గౌరవం ఉందని, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి అత్యంత ముఖ్యమని కవిత తెలియజేశారు. సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు.
- Advertisement -