Saturday, December 21, 2024

14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -


హైదరాబాద్: ఆనాడు 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చూశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. హెస్‌ఐసిసిలో టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం జరిగింది. మంత్రి కెటిఆర్ అధ్యక్షతన మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఈనాడు అభివృద్ధికి ఉద్యమం చేపట్టామన్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, కార్యవర్గ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, డిసిసిబి చైర్మన్లు, డిసిఎంఎస్ చైర్మన్లు, జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, మండల, పట్టణ అధ్యక్షులు, జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌సిలకు ఆహ్వానం పలికారు. ఉదయం పది గంటల్లో ప్రతినిధులందరూ చేరుకోవాలని కెటిఆర్ సూచించారు. 11 గంటలకు సిఎం కెసిఆర్ నాయకత్వంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అనంతరం టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ ప్రసంగించనున్నారు. ఆహ్వానించిన వారు మాత్రమే రావాలని, అన్ని గ్రామాల్లో టిఆర్‌ఎస్ జెండాలు ఆవిష్కరిస్తామని, అన్ని పట్టణాల్లో, బస్తీల్లో టిఆర్‌ఎస్ జెండాలను ఆవిష్కరించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జెండా ఆవిష్కరించే బాధ్యత ఎంఎల్‌ఎలు, జిల్లా అధ్యక్షులదేనన్నారు. ఈ కార్యక్రమానికి మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి రంజిత్ రెడ్డి, ఎంఎల్‌లు, ఎంఎల్‌సిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News