Friday, April 25, 2025

కెసిఆర్ అమరణ నిరహార దీక్ష ఉద్యమానికి గొప్ప మలుపు: ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నవంబర్ 29 తెలంగాణ చరిత్ర గతినే మార్చిన రోజు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సిఎం కెసిఆర్ చేపట్టిన అమరణ నిరహార దీక్ష తెలంగాణ పోరుకు రణ నినాదమైందన్నారు. కెసిఆర్ అమరణ నిరహార దీక్ష ఉద్యమానికి గొప్ప మలుపు తిప్పిందన్నారు. అప్పటిదాకా నడుస్తున్న శాంతియుత ఉద్యమానికి సత్యాగ్రహ ఆయుధంగా మారిందని ఇంద్రకరణ్ కొనియాడారు. తెలంగాణ ప్రజలను ఏకం చేసి కేంద్రం ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిందన్నారు. దీక్ష దివాస్ స్ఫూర్తితో తెలంగాణ పురోగతికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. కెసిఆర్‌కు అండగా నిలుద్దామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News