Saturday, December 21, 2024

తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జి. ప్రభాకర్ యాదవ్

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ సెంట్రల్ ఫోరం అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జి. ప్రభాకర్ యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉత్తర్వులు వెలువరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా తన వంతు కృషిచేయడమే తన ముందున్న లక్షమని పేర్కొన్నారు. కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఆదేశాలను తుచ తప్పకుండా పాటించి.. గడువులోగానే జిల్లాల వారీగా ఉద్యోగుల సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేస్తామని వెల్లడించారు.

ఆలానే టీఎన్జీవో కేంద్ర సంఘం నిర్దేశించిన ప్రకారం అడ్‌హక్ కమిటీలు వేసిన తర్వాత ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో టీఎన్జీవోలో చేర్పించి బలోపేతం చేస్తామన్నారు.ఈ పదవీ తనకు కట్టబెట్టిన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌లకు యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు. తనకు మున్సిపల్ ఉద్యోగులు నిర్మాణాత్మక సహకరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News