Monday, December 23, 2024

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ విలీన దినోత్సవాలు సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు
సెప్టెంబర్ 10న సుందరయ్య పార్క్ దగ్గర సిపిఎం సభ

ఆర్‌టిసి క్రాస్ రోడ్స్ వరకు ప్రదర్శన

మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సందర్భంగా సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నది. సెప్టెంబర్ 10న చిట్యాల ఐలమ్మ వర్థంతి రోజున హైదరాబాద్ సిటీలో సుందరయ్య పార్క్ దగ్గర సిపిఎం సభ నిర్వహిస్తున్నది. అనంతరం ఆర్‌టిసి క్రాస్ రోడ్స్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ సభలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు కామ్రేడ్ బృందాకరత్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం నిజాం నవాబుపై జమీందారు, జాదీర్దారులపై జరిగిన పోరాటం ఇది.

తెలంగాణ రైతాంగం జరిపిన ఈ పోరాటాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలు వక్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాడుకుంటున్నాయి. కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోరాటం ఇది. ఈ పోరాటంతో సంబంధం లేని సంఘ పరివార్ శక్తులు ఈ పోరాటానికి మతం రంగు పులిమి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ పోరాటం సాధించిన ఘనమైన విజయాలను వీరుల అసమాన త్యాగాలను, వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. సెప్టెంబర్ 10 నుండి 17 వరకు నగరంలో వివిధ ప్రాంతాల్లో ఫోటో ఎగ్జిబిషనన్లు, కళా సాంస్కృతిక ప్రదర్శనలు, సభలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News