Wednesday, January 22, 2025

తెలంగాణ కొత్త మంత్రివర్గం సిద్ధం – హోం శాఖ ఖరారు: జాబితాలో!!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నెల 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రేపు (సోమవారం) తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో సీఎం ఎంపిక నిర్ణయం హైకమాండ్ కు అప్పగిస్తూ తీర్మాణం చేయనున్నారు. అదే సమయంలో మంత్రివర్గం కూర్పు పైన ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కీలకమైన హోం , స్పీకర్ పదవుల విషయంలోనూ దాదాపు క్లారిటీ వచ్చింది. సీఎంగా ఛాన్స్ ఎవరికి : సీఎల్పీ సీఎం ఎంపిక పైనా హైమాండ్ కే నిర్ణయాధికారం ఇవ్వనుంది. ప్రస్తుతం అందుతున్న అంచనాల మేరకు కర్ణాటక తరహా ఫార్ములానే తెలంగాణలోనూ అనుసరించే అవకాశం ఉంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రేవంత్ రెడ్డి లేదా మల్లు భట్టి విక్రమార్కలో ఒకరికి సీఎంగా తొలి విడత ఛాన్స్ ఇవ్వనున్నారు. రెండున్నరేళ్ల తరువాత రెండో నేతకు అవకాశం ఇచ్చేలా ఆలోచన చేస్తున్నట్లుగా ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరు సీఎం అయితే, మరొకరు డిప్యూటీ సీఎం కానున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో ప్రభుత్వం – పాలన రెండు సమతుల్యత పాటించేలా కాంగ్రెస్ సీఎం ఎంపిక చేయనుంది. అదే విధంగా ఎస్టీ వర్గం నుంచి సీతక్కకు డిప్యూటీ సీఎంతో పాటుగా హోం మంత్రి ఇవ్వనున్నట్ల సమాచారం. మంత్రివర్గ రేసులో : మైనార్టీ వర్గం నుంచి ఓడినా కూడా షబ్బీర్ అలీకి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి..ఎమ్మెల్సీ కోటాలో పెద్దల సభకు పంనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ లో తుమ్మల నాగేశ్వర రావు (ఇరిగేషన్) వివేక్ ( పెట్టుబడులు – పరిశ్రమలు) దామోదర్ రాజనర్సింహ (వైద్య ఆరోగ్యం), కోమటిరెడ్డి వెంకటరెడ్డి – ఆర్ అండ్ బీ, ఉత్తమ్ – హౌసింగ్, జీవన్ రెడ్డి/ ఆది శ్రీనివాస్ -అటవీ శాఖ, శ్రీధర్ బాబు-అసెంబ్లీ, ఆర్దికశాఖ ఇవ్వనున్నట్లు సమాచారం.

కొండా సురేఖబిసి సంక్షేమం, జూపల్లి కృష్ణారావు మున్సిపల్ వ్యవహారాలు, సరిత తిరుపతయ్యస్త్రీ శిశు సంక్షేమం, రంగారెడ్డి నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్లు ప్రముఖంగా రేస్‌లో ఉన్నాయి. ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రిగా ప్రతిపాదన ఉన్నా ఆ జిల్లా నుంచి భట్టి, తుమ్మలకు ఖాయం కావటంతో పొంగులేటికి కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. సామాజిక సమతుల్యత : హైదరాబాద్ నుంచి ఎవరూ గెలవకపోవటంతో బీసీ వర్గానికి చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్సీ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూనే..మహిళకు మంత్రివర్గంలో సముచిత ప్రాధాన్యత ఇచ్చేలా కసరత్తు జరుగుతోంది. బీసీ వర్గానికి స్పీకర్ పదవి ఇవ్వాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. అదే విధంగా ఎస్టీ వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నారు. ఇప్పటికే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేసారు. ఈ నెల 9న ప్రమాణ స్వీకారానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని రేవంత్ ప్రకటించారు. ఈ నెల 9న తెలంగాణ నూతన సీఎంతో పాటుగా మంత్రులు ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News