Wednesday, January 22, 2025

తెలంగాణలో భారీగా పెరిగిన మెడికల్ సీట్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్ రూల్స్ సవరణ చేశారు. కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని వంద శాతం సీట్లు తెలంగాణ విద్యార్థలకే ఇవ్వనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వులతో ఏటా 1820 స్థానిక విద్యార్థులు ఎంబిబిఎస్ చదివే ఛాన్స్ ఉంది. గతంలో 85 శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు 15 శాతం అన్ రిజర్వుడ్‌గా ఎంబిబిఎస్ సీట్లు ఇవ్వనున్నారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు 56కి చేరాయి. ఎంబిబిఎస్ సీట్లు భారీగా పెరిగాయి. తెలంగాణలో 2850 నుంచి 8350కి మెడికల్ సీట్లు పెరిగాయి. దీంతో తెలంగాణ విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హరీష్ రావు సూచించారు.

Also Read: బండి సంజయ్ ఔట్.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి..!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News