Friday, December 20, 2024

సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉంది: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయ ప్రారంభం నా చేతుల మీదగా ప్రారంభించడం గొప్ప అదృష్టం అన్నారు. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని సిఎం పేర్కొన్నారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలూ వెలుగుతున్నాయన్నారు. అంబేడ్కర్ చూపిన బాటలోనే ముందుకు సాగుతున్నామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. గాంధీ మార్గంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నమని తెలిపారు. అంబేడ్కర్ రాసిన రాజ్యంగంలోని ఆర్టికల్ 3 వల్లే రాష్ట్ర వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టుకోవడం గర్వకారణమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News