Monday, December 23, 2024

నూతన సచివాలయంలో ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు రెండు ఫైళ్లపై సంతకం చేశారు. ఆదివారం నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ ప్రారంభించిన అనంతరం పలువురు మంత్రులు తమ ఛాంబర్లలో ఫైళ్లపై సంతకాలు చేశారు. బోధనాస్పత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సుల నియామక ఫైల్ మీద హరీశ్ రావు తొలి సంతకం చేశారు.

Also Read: సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉంది: సిఎం కెసిఆర్

ఇక, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు.. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మార్గదర్శకాల ఫైల్ పై సంతకం చేశారు.అలాగే, ఆర్ అండ్ బి శాఖ పునర్ వ్యవస్థీకరణ ఫైల్ పై వేముల మంత్రి ప్రశాంత్ రెడ్డి సంతకం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News