జనవరి 18న సచివాలయం ప్రారంభం
అదేరోజు సిఎం బ్లాక్‌లో ప్రవేశించనున్న కెసిఆర్
ఇక అక్కడి నుంచే కార్యకలాపాలు
మన తెలంగాణ/హైదరాబాద్: సమీకృత కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. 2023, జనవరి 18వ తేదీన కొత్త సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోపు పనులు పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బి అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థను సిఎం ఆదేశించారు. కొ త్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముందుగా 6వ అంతస్తులోని సిఎం బ్లాకు ప్రారంభించడంతో పాటు తన ఛాంబర్‌లో కెసిఆర్ బాధ్యతలను స్వీకరించనున్నారు.
మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహించాలి: మంత్రి
కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్ర శాంత్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. మూడు షిఫ్టుల్లో ప నులు వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి అధికారుల ను, వర్క్ ఏజెన్సీలకు సిఎం విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పనులన్నీ సమాంతరంగా, నాణ్యతగా జరగాలని వర్కర్లను పెంచి మూడు షిఫ్టుల్లో నిర్మాణ పనులు జరిగేలా చూడాలని వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు.
Telangana New Secretariat to begin on Jan 18