Saturday, November 23, 2024

తెలంగాణ‌లో ఏ జోన్లలో ఎన్ని జిల్లాలో తెలుసా?

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. తెలంగాణలో ఉన్న రెండు జోన్ల స్థానంలో  కొత్తగా ఏడు జోన్లు ఏర్పాటు చేశారు. మొదటి మల్టీ జోన్ల్ లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లను కలిపారు.  ఉంచారు. రెండో మల్టీ జోన్ లో యాదాద్రి, చార్మినార్, జోగుళాంబను ఉంచారు. ఏడో తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానిక జోన్ గా నిర్ణయించారు. గతంలో నాలుగో తరగతి నుంచి పదో తరగతి ఎక్కడ చదివితే అక్కడే స్థానికంగా గుర్తించారు.

  1. కాళేశ్వ‌రం జోన్
    భూపాలపల్లి, మంచిరాల్య, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు
  2. బాస‌ర జోన్
    ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు
  3. రాజన్న జోన్‌
    కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు
  4. భ‌ద్రాద్రి జోన్
    వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు
  5. యాదాద్రి జోన్
    సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు
  6. చార్మినార్‌ జోన్
    హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు
  7. జోగుళాంబ జోన్
    మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News