పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో అభివృద్ధి
పచ్చదనం పెంపుతో గొప్ప ప్రగతి ఆవిష్కరణ
ప్రతి నెలా మున్సిపాలిటీలకు రూ. 70 కోట్లు
హైదరాబాద్: ఏ రాష్ట్రంలో జరగని పట్టణాభివృద్ధి తెలంగాణలో జరిగింది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్భన్ డెవలప్‌మెంట్ శాఖ గణనీయమైన ప్రగతిని నమోదు చేస్తోంది. ఈ 9 సంవత్సరాల్లో రోడ్లు, రోడ్డు, అండర్ బ్రిడ్జిలు, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, కొత్త లింక్ రోడ్లు మొదలైన వాటిని నిర్మించి పట్టణ ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి సరఫరా సేవల కనెక్షన్‌లను మెరుగుపరచడంతో పాటు, ఇతర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచే చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ప్రగతిని ఆవిష్కరించింది. పట్టణ జనాభాకు మెరుగైన జీవన ప్రమాణాలను, పట్టణ ప్రాంతాలను పరిశుభ్రంగా, పచ్చగా మార్చే లక్ష్యంతో ‘పట్టణప్రగతి’ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలలో ప్రభుత్వం చేపడుతోంది. ఈ మేరకు ఫిబ్రవరి 2020 నుంచి మార్చి 2021 వరకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.148 కోట్లు (మున్సిపాలిటీలకు రూ.70 కోట్లు, జీహెచ్‌ఎంసికి రూ.78 కోట్లు) పట్టణప్రగతి కార్యక్రమం కింద ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 వరకు ప్రతి నెల రూ. 116 కోట్లు (మున్సిపాలిటీలకు రూ. 53 కోట్లు జిహెచ్‌ఎంసికి రూ. 59 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
పటిష్టంగా నూతన మున్సిపల్ చట్టం
రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల అభివృద్ధికి నూతన మున్సిపల్ చట్టాన్ని పటిష్టంగా రూపొందించిన ప్రభుత్వం దానిని పారదర్శకంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా మున్సిపాలిటీలకు ప్రతి నెలా ఠంచనుగా నిధులు విడుదల చేస్తోంది. పచ్చదనం అభివృద్ధి కోసం మున్సిపాలిటీల బడ్జెట్ ప్రణాళికల్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయిస్తోంది. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రభుత్వం వెజ్, – నాన్ వెజ్, సమీకృత మార్కెట్లను నిర్మిస్తోంది. దీంతోపాటు టిఎస్ బిపాస్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఇళ్ల నిర్మాణాల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసింది. 75 చదరపు గజాల స్థలంలో నిర్మించే ఇళ్లకు అనుమతి అవసరం లేకుండా ప్రభుత్వం చట్టంలో మార్పు తెచ్చింది. ఈ ఇళ్లకు నామమాత్రంగా కేవలం 100 రూపాయలు మాత్రమే ఇంటి పన్ను వసూలు చేస్తోంది. అర్భన్ మిషన్ భగీరథ ద్వారా పట్టణాల్లోని నల్లాల ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తోంది. పట్టణాల్లోనూ వైకుంఠ ధామాలను నిర్మిస్తోంది. 123 పట్టణాల్లో పేరుకుపోయిన లెగసీ వేస్ట్‌ను బయో మైనింగ్ ద్వారా ఎరువుగా మార్చే ప్రక్రియను విజయవంతంగా ప్రభుత్వం అమలుచేస్తోంది.
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల వివరాలు ఇలా…
వివరాలు సంఖ్య వార్డులు జనాభా విస్తీర్ణం (చ.కి.మిలు)
మున్సిపాలిటీలు 129 2957 53,39,180 4460
కార్పొరేషన్‌లు 12 511 23,62189 998
మొత్తం 141 3468 77,01,369 5458
జిహెచ్‌ఎంసి 01 150 67,39,158 627
మొత్తం అన్నీ కలిపి 142 3618 1,44,40,527 6085
పలు విభాగాల్లో నమోదైన ప్రగతి ఇలా….
నవంబర్ 2020 నుంచి మే 2023 వరకు స్వీకరించిన, ఆమోదం తెలిపిన టిఎస్ బిపాస్ దరఖాస్తుల వివరాలు
క్ర.సం వివరాలు స్వీకరించినవి ఆమోదం పొందినవి
1 ఇన్ స్టాంట్ రిజిస్ట్రేషన్ 22,643 7,481
2 ఇన్ స్టాంట్ అప్రూవల్ l 1,52,512 1,23,127
3(a) సింగిల్ విండో – బిల్డింగ్ 16,318 8,336
3(b) సింగిల్ విండో – లే ఔట్ 1,513 701
4 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ 11,372 7059
మొత్తం 2,04,731 1,39,604
ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు స్వీకరించిన, ఆమోదం తెలిపిన టిఎస్ బిపాస్ దరఖాస్తుల వివరాలు
క్ర.సం వివరాలు స్వీకరించినవి ఆమోదం పొందినవి
1 ఇన్ స్టాంట్ రిజిస్ట్రేషన్ 9,198 3,297
2 ఇన్ స్టాంట్ అప్రూవల్ 63,933 53,352
3(a) సింగిల్ విండో – బిల్డింగ్ 8,985 4,629
3(b) సింగిల్ విండో – లే ఔట్ 941 455
4 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ 6763 4,433
మొత్తం 93,362 65,991
కమిషనర్ అండ్ డైరక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (జిహెచ్‌ఎంసి మినహాయించి 141 పట్టణ స్థానిక సంస్థలు)
పథకం పేరు సంవత్సరం లబ్ధిదారులు మొత్తం (రూ. కోట్లలో)
సంపద పన్ను మినహాయింపు 2014- టు 2023 39,38,868 292.61
పట్టణ ప్రగతి కార్యక్రమం 2020- టు 2023 1,44,40,527 4537.79
స్వచ్ఛ భారత్ 2015 టు -2023 1,44,40,527 368.34
బస్తీ దవాఖానలు 2021- టు 2023 35,00,350 99.91
అన్నపూర్ణ మీల్స్ 2015 టు -2023 (1,83,85,625)* 44.58
ఆధునిక దోబీఘాట్‌లు 2015- టు 2023 77,01,369 282.00
(అమలు ప్రక్రియలో ఉన్నవి)సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు 2015- టు 2023 15,40,274**522.50
పథకం పేరు సంవత్సరం లబ్ధిదారులు మొత్తం (రూ. కోట్లలో)
వైకుంఠధామాలు 2015- టు 2023 15,40,274** 346.50
తెలంగాణ క్రీడా ప్రాంగణాలు 2021- టు 2023 25,46,000 63.65
మల బురద శుద్ధి కర్మాగారాలు (FSTP) 2015- టు 2023 15,40,274** 431.00
పబ్లిక్ టాయిలెట్లు 2015 టు – 2023 22,72,000*** 89.06
కొత్త పారిశుద్ధ్య వాహనాలు 2015- టు 2023 36,06,400 (రోజుకు) 157.78
బయో మైనింగ్ 2021 టు – 2023 2,11,632**** 178.60
మొత్తం 7103.28
ఈ గవర్నెన్స్, ఈ సెంట్రిక్ సర్వీసులు
పథకం పేరు సంవత్సరం లబ్ధిదారులు
ఇన్ స్టాంట్ ఆటోమ్యుటేషన్ 2021టు -2023 5,70,631
ప్రాపర్టీట్యాక్స్ సెల్ఫ్ అసెస్‌మెంట్ 2019 టు -2023 1,80,265
ఇన్‌స్టాంట్ పిటి/విఎల్‌టి అసెస్‌మెంట్, ఎస్‌ఆర్‌ఓ 2022- టు-2023 2,90,513
ఇన్‌స్టాంట్ పిటి/విఎల్‌టి అసెస్‌మెంట్, టిఎస్ బిపాస్ 2014 టు -2023 1,20,631
జనన, మరణ ధృవీకరణ పత్రాలు 2022 టు -2023 1,26,792