Monday, December 23, 2024

ఈఒడిబిలో నంబర్ వన్‌గా ముందుకుసాగాలి : సోమేష్‌కుమార్

- Advertisement -
- Advertisement -

Telangana Number one in EODB

మనతెలంగాణ/ హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఒడిబి)లో నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇదే విధంగా కొనసాగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ కోరారు. సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల బిఆర్‌కెఆర్ భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ (సిటి & ఎక్సైజ్), పౌర సరఫరాలు, రవాణా, ఇంధనం, గృహ నిర్మాణం, మున్సిపల్,కార్మిక, తదితర 12 విభాగాలకు చెందిన కస్టమర్లు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలు సూచనలు చేశారు. ప్రభుత్వంలోని 12 శాఖల్లోని 20 హెచ్‌ఓడీలలో 301 సంస్కరణలు ఈవీడీఎంలో భాగంగా అమలవుతున్నాయని, ఈ ప్రక్రియలను మరింత సరళీకృతం చేసి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూనే, యూజర్ ఫ్రెండ్లీ, పీపుల్ ఫ్రెండ్లీ విధానాలను రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో ఉపాధి శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఈఎస్&టి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, సంబంధిత శాఖల ఉన్నతాధితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News