Thursday, January 23, 2025

సంక్షేమ పథకాలలో తెలంగాణ నెంబర్ వన్: గుత్తా

- Advertisement -
- Advertisement -

నల్గొండ: సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.  దేశం మొత్తం సిఎం కెసిఆర్ నాయకత్వం వైపు చూస్తోందన్నారు. గురువారం నల్గొండ లోని క్యాంపు కార్యాలయంలో  వివిధ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందిన17 మంది లబ్ధిదారులకు రూ. 10,32,000 గుత్తా సుఖేందర్ రెడ్డి  ముఖ్యమంత్రి  సహాయనిధి ద్వారా ( సీఎంఆర్ఎఫ్) మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా గుత్తా మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించలేని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని పేర్కొన్నారు. మిగతా రాష్టాల్లోని ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అమలు చేయాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గొప్ప విజన్ ఉన్న నాయకుడని, ఇప్పుడు దేశం మొత్తం ఆయన నాయకత్వం వైపు మక్కువ చూపుతుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, తదితరులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News