Monday, December 23, 2024

అభివృద్ధి పథంలో తెలంగాణ

- Advertisement -
- Advertisement -

దోమకొండ: మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయ ప్రధాన రాజ గోపురం నిర్మానానికి సొమవారం ప్రభుత్వవిప్ గంప గోవర్ధన్ శంకుస్థాపన చేసారు. మరియు బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సోమవారం ప్రారంభించారు. మండలంలోని ముత్యంపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని విప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణతో పాటు, కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలాంగాణ రాష్ట్రం, దేశం అభివృద్ధ్ది చెందుతుందని అన్నారు. తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధ్ది చెందుతుందన్నారు.

ఈ కార్యక్రమమంలో జెడ్‌పిటిసి తీగల తిర్మల్ గౌడ్, ఎంపిపి కాగంటి శారద నాగరాజు, నాగరాజురెడ్డి, బిఆర్‌ఎస్ జిల్లా ఆద్యక్షుడు ముజిబుద్దీన్, మండల బిఆర్‌ఎస్ అద్యక్షుడు గండ్ర మధుసుదన్ రావు, ఐరేని నర్సయ్య, స్థానిక సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, ముత్యంపేట సర్పంచ్ ప్రకాస్‌రెడ్డి, పిరంగి రాజేశ్వర్, నాయకులు కుంచాల శేఖర్, నాగరాజురెడ్డి, మండల నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News