Thursday, January 23, 2025

తెలంగాణ పప్పు రేవంత్.. ఇండియా పప్పు రాహుల్

- Advertisement -
- Advertisement -

నిప్పులు చెరిగిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్
మేడిగడ్డపై ఈ ఇద్దరు ‘మహా’ ఇంజినీర్లు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం

ఎక్స్‌పాన్షన్ జాయింట్‌ను చూసి పగుళ్లని ఆరోపిస్తున్నారని ఎద్దేవా

రాష్ట్రానికి వరం కాళేశ్వరం.. దేశానికి కాంగ్రెస్ శనీశ్వరం అని ఘాటు వ్యాఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్:  రాహుల్ గాంధీపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ పప్పు రేవం త్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ అని అ న్నారు. బిఆర్‌ఎస్‌లో చేరికలు వెల్లువెత్తుతున్నా యి. తెలంగాణ భవన్‌లో గురువారం మానకొండూరు బిజెపి ఇన్‌చార్జి గడ్డం నాగరాజు తన అనుచరులతో మంత్రి కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ ప్రసంగిస్తూ కాళేశ్వరం అవినీతి అని రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. వీళ్లిద్దరూ ఎగేసికొని పోయి కాళేశ్వరం చూసి వచ్చారని, మహా ఇంజనీర్లు వీ ళ్లు బ్రిడ్జి కూలిపోతుంది అని ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జాయింట్ ను చూపి స్తూ కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోతుంది అంటూ ఫొ టోలు పెడుతున్నారు. ఇది వీళ్ల అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం పై డిస్కవరీ ఛానల్ స్పెషల్ కవరేజ్ ఇచ్చిందని ఈ సందర్భం గా గుర్తు చేశారు. కాళేశ్వరం గురించి మీ పక్కన ఉన్న సన్నాసులు చెప్పిన సొల్లు కాకుండా అసలు విషయాలు తెలుసుకోవాలని సూచించారు.

రాష్ట్రానికి వరం కాళేశ్వరం, దేశానికి శనీశ్వరం కాంగ్రె స్ పార్టీ అని కెటిఆర్ అన్నారు. రాహుల్ గాంధీ కి చరిత్ర తెల్వదు, తెలుసుకునే సోయి లేదు. స్క్రిప్ట్ అన్న మార్చుకో లేదా స్క్రిప్ట్ రైటర్ నన్న మార్చుకో అని రాహుల్‌కి సూచించారు. కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంతో ధన యజ్ఞం చేసిందని విమర్శించారు. నోటుకు ఓటులో అడ్డంగా దొరికి, కాంగ్రెస్ పార్టీ టికెట్లను అంగట్ల గొడ్లను అమ్మినట్టు అమ్ముకు న్న రేవంత్ అలియాస్ రేటెంత రెడ్డిని పక్కన పెట్టుకొని అవినీతి గురించి మాట్లాడడం దేశంలో అతిపెద్ద వింత అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అని దేశం లో ఎవరిని అడిగిన చెప్తారు. ఆదర్శ్, బోఫోర్స్, కా మన్ వెల్త్, స్ప్రెక్ట్రం, బొగ్గు ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో సహజ వనరులన్నీ దోచుకున్న దొంగలు అని విరుచుకుపడ్డారు. పంచ భూతాలను.. ఆకాశాన్ని, పాతాలన్ని మింగిన అవినీతి తిమింగాలాలని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మం త్రులు, రాష్ట్ర మంత్రులు, అవినీతి ఆరోపణలతో జై ల్లో ఊచలు లెక్కబెట్టారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పత్రికలో నేషనల్ హెరాల్డ్‌లో కూడా అవినీతికి పా ల్పడి సిబిఐ, ఇడి విచారణ ఎదుర్కొన్న మీరు నీతి, నిజాయితీ అంటే జనం నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం గురించి మీ పక్కన ఉన్న సన్నాసులు చెప్పిన సొల్లు కాకుండా అసలు విషయాలు తెలుసుకోవాలి. అవన్నీ 80 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేశారు. ఖర్చు చేసింది 80 వేల కోట్లు అయితే లక్ష కోట్ల అవినీతి ఎక్కడరా వెదవళ్లారా. దున్నపోతు ఈనిందంటే దొడ్లో కట్టెయ్యమని ఒకడు జున్నుపాలు తెమ్మని ఒకడు.. దూడ బాగుందా ఒకడు అంటున్నారు.. సన్నాసుల్లారా మీరు 2008 లో వేసిన ప్రాణహిత అంచనా 40వేల కోట్లు అందు లో రిజర్వాయర్లు లేవు. కాలువలకు, పంపు హౌసులకు అంత పెట్టారు, 15 ఏళ్ల తర్వాత అంచనాలు పెరగవా.

మీ హయాంలో మానకొండూరులో సాగునీరు లేక ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల్లో క్రికెట్ ఆడుకునే వాళ్లం. ప్రాణహిత నదిలో నీటి లభ్యత తక్కువ ఉంద ని ఎలాంటి కరువు వచ్చిన తెలంగాణకు ఇబ్బందు లు లేకుండా చూడడం కోసం శబరి, ప్రాణహిత, గో దావరి కలిసే ప్రాంతంలో మేడిగడ్డకు అం కురార్పణ చేశారు. తమ్మిడిహెట్టి నుంచి నుంచి నీరు ఎల్లంపల్లి కి వచ్చే బదులు ఎక్కువ నీటిని మేడిగడ్డ నుంచి తెచ్చే విధంగా ప్రాజెక్టు రూపొందించారని కెటిఆర్ వివరించారు. తెలంగాణ జాతి సంపద కాళేశ్వరం ప్రాజెక్టు. ఎల్లంపల్లి నుంచి మిగతా ప్రాజెక్టు యథావిధిగానే ఉంది కదా. 50 టిఎంసిలు మల్లన్న సాగర్, 3 టిఎంసిలు రంగనాయక్ సాగర్, 12 టిఎంసిలు కొండపోచమ్మ సాగర్ ఇంకా గందమల్ల ఇలా అనేక రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, భారీ పంపు హౌస్‌లు నిర్మించారు. సుందిళ్ళ, అన్నా రం, మేడిగడ్డ, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, గందమల్ల ఇలా దాదాపు 10 కొత్త జలాశయాలు నిర్మించి ఇప్పుడు తెలంగాణ దేశంలోనే అతిపెద్ద ధాన్యాగారంగా తయారైందని కెటిఆర్ స్పష్టీకరించారు.
కాళేశ్వరంపై అవాకులు, చెవాకులు పేలితే ఊరుకునేది లేదు
తెలంగాణ జాతి సంపద కాళేశ్వరం పై అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జేబులో వంద రూపాయల నోటు కెసిఆర్ అ ని అది వదులుకొని కిందపడిన చిల్లర కోసం వెంపర్లాడితే ఏం ప్రయోజనం అని పేర్కొంటూనే, కిందపడిన చిల్లరగాళ్లు రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డిలేనని కెటిఆర్ చమత్కరించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ 3 గంటల కరెంటు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు దుస్థితి వస్తుందని ఇది పరిగణనలోనికి తీసుకోవాలని.. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. బిఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించినవన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా పార్టీలో జాయిన్ అయిన నేతలకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా కెటిఆర్ సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News