Wednesday, January 22, 2025

ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ భేష్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి ప్రశంస

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల అమలు తీరును కమిటి సభ్యులు ప్రశంసించారు. శుక్రవారం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై పార్లమెంటరీ స్థాయి స్టాండింగ్ కమిటి అధ్యయనం నిమిత్తం హైదరాబాద్ పర్యటనకు వచ్చింది. పార్లమెంటరీ కమిటి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ, నిర్వహణ చర్యలు, ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ అమలు కార్యక్రమాలపై సమీక్షించారు.

భువనేశ్వర్ కలితా నేతృత్వంలోని కమిటి ఆరోగ్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సిఎస్ శాంతి కుమారి నిర్వహణా కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. వైద్య కళాశాలల నిమిత్తం ప్రభుత్వం భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ను చేపట్టినట్లు కమిటీకి తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కెసిఆర్ కిట్ పథకం ద్వారా గర్భిణీలకు ఆర్థిక సహాయం, ఇతర ఆరోగ్య సంబంధిత పథకాలను కమిటికి తెలిపారు.

కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ‘అంధత్వ రహిత తెలంగాణ’ కోసం ప్రభుత్వ లక్షంగా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల అమలు తీరుపై పార్లమెంటరీ కమిటి సభ్యులు ప్రశంసించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేతా మొహంతి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News