Thursday, January 23, 2025

తెలంగాణ పిసిసి చీఫ్ ఫిక్స్… నేడే ప్రకటన!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి చీఫ్ పదవిపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. తెలంగాణ పిసిసి చీఫ్‌ ఎవరనేది నేడు తేలిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పిసిసి చీఫ్ పేరును ఖారారు చేసినట్లు తెలుస్తోంది. దాన్ని అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం.

తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాలకు కొత్త పిసిసి చీఫ్‌లపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది. మూడు రాష్ట్రాలను పిసిసి చీఫ్‌లను ఏఐసిసి ప్రకటించనుంది. నేటి సాయంత్రం లేదా రేపు ఉదయం మూడు రాష్ట్రాలకు కొత్త పిసిసి అధ్యక్షుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. అలాగే పశ్చిమ బెంగాల్ పిసిసి చీఫ్‌గా దీపాదాస్ మున్సీ, కేరళ పిసిసి అధ్యక్షుడుగా కెసి. వేణుగోపాల్ పేరు ఖరారయినట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News