Sunday, January 19, 2025

పరిశీలనలో పాత పెన్షన్లు!

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ అభయమిచ్చినట్లు
ఉద్యోగ సంఘాల నాయకుల ప్రకటన కెసిఆర్‌ను
అభినందించడానికి హస్తినకు వెళ్లిన ఎన్‌ఎంఒపిఎస్,
రాష్ట్ర కాంట్రిబూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్
నేతలు సిఎంతో భేటీ…పాత పెన్షన్ సమస్యపై చర్చ
దేశవ్యాప్తంగా అమలవుతున్న నూతన పెన్షన్ విధానాన్ని
అధ్యయనం చేస్తామని కెసిఆర్ హామీ పాత పెన్షన్‌పై
బిఆర్‌ఎస్ పార్టీ విధానాన్ని ఖరారు చేస్తామని వాగ్దానం

మనతెలంగాణ/హైదరాబాద్: పాత పెన్షన్ అమలును పరిశీలిస్తామని ఎన్ ఎంఓపిఎస్ (నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం) నాయకులకు సిఎం కెసిఆర్ హామీఇచ్చారు. శుక్రవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సం ఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ, రాష్ట్ర కాంట్రీ బ్యూ టరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్‌లు న్యూ ఢిల్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి సిపిఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశా రు. భారత రాష్ట్ర సమితి ఏర్పాటు, జాతీయ విస్తరణ సందర్భంగా సి ఎంకు ఉద్యోగ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

రా ష్ట్రంలో 2004 నుంచి నియామకం అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యో గులు లక్షా 70 వేల సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు పని చేస్తున్నా రని, దేశ వ్యాప్తంగా 84 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయులు సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని వారు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, పాత పెన్షన్ అమలుపై బిఆర్‌ఎస్ పార్టీ పరంగా నిర్ణయం తీసు కోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, సిక్కిం క్రాంతికారి మోర్చా, జనతా కాంగ్రెస్ తదితర పార్టీ లు పాత పెన్షన్ విధానానికి మద్దతు పలికాయని, ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ సిపి ఎస్‌ను రద్దు పరచి పాత పెన్షన్‌ను అమలు చేయాలని నిర్ణయిం చిందని వారు సిఎంకు తెలిపారు. నూతన పెన్షన్ విధానంపై అధ్య యనం చేసి, పాత పెన్షన్ల అమలుపై పార్టీ పరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుం టామని సిఎం కెసిఆర్ వారికి హామీనిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News