Wednesday, January 22, 2025

దివ్యాంగులను ఆదుకున్న ఘనత కెసిఆర్ దే: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

 

మహబూబ్ నగర్: తెలంగాణ ఏర్పాటుకు కాకముందు కేవలం రూ.200 పింఛన్ మాత్రమే ఇచ్చేవారని, నేడు రూ.3016 పింఛన్ అందిస్తున్నామని, దివ్యాంగుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ లోని మెట్టుగడ్డలో ప్రభుత్వ దివ్యాంగుల బాలుర వసతి గృహం ఉందని, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రూ. 3016 పింఛన్ పేద దివ్యాంగులకు ఎంతో సహకారంగా ఉంటున్నదని మంత్రి తెలిపారు. దివ్యాంగుల క్రీడలకు సైతం తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. దివ్యాంగుల కోరిక మేరకు వచ్చే ఏడాది నాటికి దివ్యాంగుల హోమ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, ముడా ఛైర్మన్ గంజి వెంకన్న, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News