Sunday, January 19, 2025

తెలంగాణ ప్రజలే మా బలం.. బలగం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తున్నది

కెసిఆర్ సిఎంగా హ్యాట్రిక్ కొట్టడం పక్కా

తెగించి కొట్లాడిన తెలంగాణ ప్రగతి కోసం మెదళ్లను కరిగించి, రక్తం రంగరించి, ప్రాణాలు పెట్టి పనిచేశాం
ధ్వంసమైన రాష్ట్రాన్ని ఇటుక ఇటుక పేర్చి పునర్నిర్మాణం చేశాం
సిరిసిల్ల మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: మా బలం, బలగం తెలంగాణ ప్రజలేనని.. ఓటు వేసేముం దు ఒకటికి వందసార్లు ఆలోచించి వేయాలని బి ఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల బిఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి కెటిఆర్ అన్నారు. మంగళవా రం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కెటిఆర్ మాట్లాడారు. 70ఏండ్ల ఎన్నికల చరిత్రలో తెలంగాణ ఎన్నో పార్టీలను గెలిపించిందని, కానీ తెలంగాణను గెలిపించిన పార్టీ మాత్రం బిఆర్‌ఎస్ ఒక్కటే అని కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్, బిజెపి మళ్లీ తెలంగాణలో గెలవాలని చూస్తున్నాయని, మేము తెలంగాణను మళ్లీ గెలిపించాలని చూస్తున్నామని ఇదే వారికి మాకు తేడా అని అన్నారు.

తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక కెసిఆర్ అని, ఆ గొంతును నొక్కేయాలని చూస్తున్నారన్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మన దే అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వందల సభలు, రోడ్ షోల్లో ప్రజల మనసులు తెలుసుకున్నామన్నా రు. ప్రజలు వెల్లువలా తరలి వచ్చారని, ఆటపాటలతో నీరాజనం పట్టారన్నారు. పాజిటివ్ వైబ్రేషన్ కనిపించిందన్నారు. మూడోసారి గులాబీ ప్రభంజనం ఖాయమన్నారు. కెసిఆర్ సిఎంగా హ్యాట్రిక్ కొట్టడం పక్కా అన్నారు. కొత్త రికార్డులు, చరిత్ర సృష్టించడం కెసిఆర్‌కు కొత్తకాదన్నారు. సౌత్ ఇం డియాలో మూడోసారి సిఎంగా కెసిఆర్ కాబోతున్నారన్నారు. సోషల్ మీడియాలో వచ్చే మాయామశ్చీంద్రాగాళ్ల ఫేక్ న్యూస్‌ను, ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మెద ళ్లు కరిగించి, రక్తాన్ని రంగరించి, ప్రాణం పెట్టి పని చేశామన్నారు. దశాబ్దాల కన్నీళ్ల్లు, బాధలు తొలగిపోవాలని, తెలంగాణ ప్రజలు కడుపునిండా తిని కంటినిండా నిద్దురపోయే రోజులు తీసుకురావాలని కృషి చేశామన్నారు. విధ్వంసం పాలైన తెలంగాణను ఇటుక ఇటుక పేర్చి పునర్నిర్మాణం చేసుకున్నామన్నారు. సంపద పెంచి సకల జనులకు పంచి సంక్షేమ రాజ్యాన్ని సరికొత్త నమూనాను దేశం ముందు ఉంచామన్నారు. బిఆర్‌ఎస్ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అన్నారు. తెలంగాణే శ్వాసగా బతికి 14 ఏండ్లు పేగుల తెగేదాక కొట్లాడి, అవమానాలు, అవహేళనలు లెక్క చేయక, లక్ష కుట్రలు ఎదుర్కొని చావునోట్లో తలపెట్టి డిల్లీ మెడలు వంచి స్వరాష్ట్రాన్ని కెసిఆర్ సాధించారన్నారు. ఉద్యమంలో నడిచిన సబ్బండ వర్ణాల సకల జనుల సమస్యలు ఆశలు ఆకాంక్షలు తెలిసిన వాళ్లమన్నారు. అంతులేని జీవన విధ్వంసం పాలైన తెలంగాణకు జవజీవాలు నింపి సుజల సుఫల తెలంగాణగా తీర్చిదిద్దుకున్నామన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News