Friday, November 22, 2024

తెలంగాణ ప్రజల ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 30న జరిగే ఎన్నికల్లో బిజెపికి బంపర్ మెజారిటీ ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కోరారు. మీ నిర్ణయం ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే కోసమో కాదని.. మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. చైతన్యవంతమైన తెలంగాణ ఓటర్లు బిజెపికి, మోడీకి అండగా ఉంటారని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. శనివారం సోమాజిగూడ కత్రియాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల దేశంలోని యువత, దళితులు, వెనుకబడిన వర్గాలు చాలా అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పినట్లు రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370ను పూర్తి చేశామని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే వరికి క్వింటాలుకు రూ. 3,100 ఇవ్వడంతో పాటు పారాబాయిల్డ్ రైస్ కొంటామని ప్రకటించారు.మోడీ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తే బిజెపి పాలిత రాష్ట్రాలు చాలావరకు ధరలు తగ్గించినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు నామమాత్రంగా తగ్గించయన్నారు. తాము అధికారంలోకి రాగానే వ్యాట్ తగ్గిస్తామని, రామమందిర నిర్మాణం వేగంగా జరుగుతోందని వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ దర్శనం చేయిస్తామని హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ సిఎం అంజయ్యను కాంగ్రెస్ అవమానించిందని విమర్శించారు. తెలంగాణను అవకాశం దొరికినప్పుడు అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని, కాంగ్రెస్,మజ్లిస్ ఆలోచనలు ఒక్కటేనన్నారు. తెలంగాణ ప్రజలంతా వేసే ఓటు వల్ల అధికార మార్పిడి జరుగుతుందని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బిఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం అప్పగిస్తారని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News