Thursday, December 19, 2024

మావోయిస్టుల డేటా మటాష్

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సేకరించిన డేటా
మొత్తాన్ని మూసీ పాలు చేసిన ప్రణీత్‌రావు ముఠా మొత్తం 17 కంప్యూటర్లకు సంబంధించిన
42 హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు వాటి నుంచి తిరిగి డేటాను పొందడం
అసాధ్యమని తేల్చిన నిపుణులు ఫోన్ ట్యాపింగ్‌లో రోజుకో కొత్త అంశం వెలుగులోకి..

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంటోందన్న వాదన వినవస్తోంది. ఓ రకంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికలు, ఉపఎన్నికల్లో ప్ర తిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఇప్పటికే ఈ కే సులో అరెస్టైన నిందితులు వాంగ్మూలం ఇచ్చారని తెలిసింది. గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సేకరించిన డేటా మొ త్తాన్ని ప్రణీత్ రావు గ్యాంగ్ నాశనం చేసినట్లుగా గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు విలువైన భూములకు సంబంధించిన డేటాను కూడా ధ్వంసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

ప్రణీత్ రావు తాజా డేటాను మాత్రమే కాకుండా దశాబ్దాలుగా ఎస్‌ఐబి సేకరించిన సమాచారం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తం 17 కంప్యూటర్ల కు సంబంధించిన 42హార్డ్ డిస్కులను కూడా ప్రణీత్‌రావు ధ్వంసం చేశారని గుర్తించారు. ఇలా ఈ హార్డ్ డిస్కులను మూ సీ నదిలో పడేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వం మారుతుందని తెలియగానే ప్రణీత్ రావు మొత్తం డేటా నాశ నం చేసినట్లుగా భావిస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించిన పాత డేటా పోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డేటా తిరిగి పొందే అవకాశం కూడా లేదని ఐటి నిపుణులు చెబుతున్నారు. మూసీ నది నుంచి రికవరీ చేసిన హార్డ్‌డిస్క్‌ల నుంచి డే టా రికవరీ సాధ్యం కాదని తేల్చేశారు.

ప్రణీత్ రావు చేసిన ప నితో పోలీ సులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఎస్‌ఐ బి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగినట్లు ప్రణీత్‌రావు తన వాంగ్మూలంలో వె ల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యా బ్ టూల్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ల్యా బ్ డైరెక్టర్లను విచారించే అవకాశం ఉందని సమాచారం. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి సమీపంలో గెస్ట్ హౌస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిసిందని విచారణలో వెల్లడైంది. జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలోని ఎంఎల్‌సికి చెందిన గెస్ట్‌హౌస్‌లో సో మవారం పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.

ఫో న్ ట్యాపింగ్ వ్యవహారానికి ఈ గెస్ట్ హౌస్‌ను ప్రణీత్ రావు టీమ్ కేంద్రంగా మార్చుకుందని పోలీసులు గుర్తించారు. రేవంత్ రె డ్డి ఇంటికి అతి సమీపంలోని ఈ గెస్ట్‌హౌస్ నుంచి అడిషనల్ ఎస్‌పి భుజంగరావు ట్యాపింగ్ ఆపరేషన్ చేశారని తెలుస్తోంది. ఈ కేసులో నిందితుల నుంచి రాబట్టిన సమాచారంలో పోలీసు లు సోదాలు నిర్వహించారని సమాచారం. అయితే ప్రణీత్ రా వు తరహాలో గెస్ట్ హౌస్‌లో ఫోన్ ట్యాపింగ్ ఆధారాలన్నింటిని భుజంగరావు ముందే ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ గెస్ట్ హౌస్ వ్యవహారంలో సదరు ఎంఎల్‌సిని విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

7 ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు..!
మరోవైపు నల్లగొండ, హైదరాబాద్‌లలో రెండు చోట్ల ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ దగ్గర పర్వతగిరి, సిరిసిల్ల, ఖమ్మంలో ఒక్కో చోట ట్యాపింగ్ సెంటర్ల ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు మొత్తం 7 ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. నల్లగొండ విటీ కాలనీలో నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల మానిటరింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు.

అలాగే ఖమ్మం జిల్లా కోసం నేలకొండపల్లి మామిడి తోటలోని గెస్ట్ హౌస్‌లో ట్యాపింగ్ సెంటర్‌ను పెట్టారు. హైదరాబాద్ ఎస్‌ఐబి ఆఫీస్‌తో పాటు జూబ్లీహిల్స్‌లోనూ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటుచేశారు. వరంగల్, సిరిసిల్లలో సైతం ట్యాపింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారని పోలీసులు గుర్తించారు. కానిస్టేబుల్ నుంచి డిసిపి స్థాయి వరకు ట్యాపింగ్‌ను అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నేతల కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు బయటపడింది. ఈ కేసుకు సంబంధించి పోలీస్ అదుపులో నలుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News