Monday, January 20, 2025

ఫోన్ ట్యాపింగ్‌లో… షాకింగ్ పరిణామాలు

- Advertisement -
- Advertisement -

మనీల్యాండరింగ్‌పై ఇడికి ఫిర్యాదు వ్యాపారస్థులను బెదిరించి
కోట్లు వసూలు చేశారని ఆరోపణ హవాలా మార్గంలో
తరలించినట్లు నిందితులు అంగీకరించారని ఫిర్యాదులో స్పష్టీకరణ
ఫిర్యాదు నేపథ్యంలో ఇడి జోక్యంపై జోరెత్తిన ఊహాగానాలు
రాధాకిషన్‌రావుపై మరో పోలీసు కేసు నమోదు..రిమాండ్ పొడిగింపు
ప్రత్యేక పిపిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్ర కంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కే సు లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు సీనియర్ న్యాయవాది సురేష్ కేంద్ర దర్యాప్తు సం స్థ ఇడికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తం గా వార్ రూములను ఏర్పాటు చేసి రాజకీ య నాయకుల, బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి, రకరకాల సె టిల్మెంట్లకు, బెదిరింపులకు పాల్పడ్డారని, పో లీసు ఉన్నతాధికారుల నుండి, కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తాజాగా జరుగుతున్న విచారణ లో తెలిసింది.

అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ బ్లాక్‌మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూ లు చేశారని, ఈ డబ్బులను ఎన్నికల కోసం వాహనాలలో తరలించారని, ఎన్నికల సమయంలో పోలీస్ అధికారుల ముఠా వాహనాలలోనే అధికార పార్టీకి చెందిన డబ్బు తరలింపు జరిగిందని ప్రధానంగా వెలుగుచూసింది. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు న్యా యవాది సురేష్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మ నీలాండరింగ్ కోణాన్ని దర్యాప్తు చేయాలని ఇడి అధికారులకు ఫిర్యా దు చేశారు. ఈ కేసులో పిఎంఎల్‌ఎ చట్టం కింద కేసు నమోదు చేయాలని పేర్కొన్న అడ్వకేట్ సురేష్ ఈ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించ లేదని, ఇడి కేసు నమోదు చేసి రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తే అసలు నిందితులు బయటకు వస్తారని తన ఫిర్యాదులో వెల్లడించారు. నిందితులు ఫోన్ ట్యాపింగ్‌తో కోట్లా ది రూపాయలు వసూలు చేశారు.

రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేశారని, ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లో డబ్బులు తరలించారని నిందితులు విచారణలో స్వయంగా ఒప్పుకున్నారు అని పిటిషన్‌లో వెల్లడించారు. ఇడి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని కేసు నమోదు చేయాలన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా పెను దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు లో ఫిర్యాదు నేపథ్యంలో ఇడి ఎంట్రీ ఇస్తుందా? ఒకవేళ ఈ కేసులో ఇడి ఎంటర్ అయితే ఎలా ఉండబోతుంది? అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది.

టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావుపై
మరో పోలీసు కేసు నమోదు –
టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయనతో పాటు, మరో ఎనిమిది మంది పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపార వేత్త ఫిర్యాదు మేరకు, పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హర్వ ర్డ్ యూనివర్సిటీలో ఎంబిఎ చదువుకుని వరల్డ్ బ్యాం కులో పనిచేసిన తాను, 2011లో క్రియా పేరుతో హెల్త్‌కేర్ సర్వీస్‌ను ప్రారంభించిట్లు వేణుమాధవ్ ఫిర్యాదులో వెల్లడించారు. 2014లో ఎపిలో అప్పటి ప్రభుత్వంలో 165 హెల్త్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి, ప్రభు త్వ హెల్త్‌కేర్ సెంటర్లలో పలు రకాల సేవలు అందించారన్నారు. వీటితో పాటు ఖమ్మంలో టెలిమెడిసిన్, జాతీయ రహదారులపై అత్యవసర వాహనాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

కాగా ఉత్తరప్రదేశ్‌లో హెల్త్ కేర్ సెంటర్ల ప్రాజెక్టు తమకు వచ్చిన సమయంలో, పార్ట్‌టైమ్ డైరెక్టర్లుగా గోపాల్, రాజ్, నవీన్, రవిలను నియమించుకున్నామని, బాలాజీ అనే వ్యక్తిని సిఇఒగా పెట్టామని వెల్లడించారు. ఇదే క్రమంలో చంద్రశేఖర్ వేగే అనే తనకు తెలిసిన వ్యక్తి తమ కంపెనీలో షేర్లు కొని, డైరెక్టర్లతో కుమ్మక్కై కంపెనీ మొత్తాన్ని స్వాధీనం పరుచు కునేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. తాను ఒప్పుకోకపోడంతో టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్, ఇన్స్‌పెక్టర్ గట్టుమల్లు, ఎస్‌ఐ మల్లిఖార్జున్ల సాయంతో కిడ్నాప్ చేయించి, డిసిపి కార్యాలయంలో చిత్రహింసలకు గురిచేశారని వెల్లడించారు. చంద్రశేఖర్ చెప్పినట్లుగా వినాలని లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో ఆయన తెలిపారు. 100కోట్ల తన కంపెనీని అతని పేరుపై రాయించుకునే ప్రయత్నం చేశారని వెల్లడించారు. మీడియాకి, ఉన్నతాధికారులకు చెప్తే వేరే పరిణామాలు ఉంటాయని హెచ్చరించారన్నారు. సిఐ గట్టుమల్లు అతని బృందానికి 10లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. తాజాగా రాధాకిషన్ అరెస్ట్ వార్తలు విని, ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఘటనపై నిందితులపై చర్యాలు తీసుకోవాలని కోరారు. రాధాకిషన్ రావు సహా 9మందిపై 386, 365, 341, 120బి రెడ్ విత్ 34, సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రాధాకిషన్‌రావు రిమాండ్ పొడిగింపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. వారం రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయననను నాంపల్లి కోర్టులో బుధవారం హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని రాధాకిషన్‌రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్‌ను సైతం కలవనీయడం లేదని వెల్లడించారు. దీంతో పోలీసులను న్యాయమూర్తి పిలిపించి ప్రశ్నించారు. లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. తొలుత గాంధీ ఆసుపత్రిలో రాధాకిషన్‌రావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టు రిమాండ్ విధించినానంతరం చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు.

హై ప్రోఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పిపిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం?
ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ కోసం ప్రత్యేక పిపిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. నెలరోజులుగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రాధాకిషన్‌రావుతో పాటు మాజీ అడిషినల్ ఎస్‌పిలు భుజంగరావు, తిరుపత్న, మాజీ డిఎస్‌పి ప్రణీత్‌రావులను అరెస్ట్ చేశారు.. హై ప్రోఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పిపిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News