Sunday, December 22, 2024

మూగబోయిన ‘తూప్రాన్‌’

- Advertisement -
- Advertisement -

1949లో తూప్రాన్‌లో పురుడు
పోసుకున్న తెలంగాణ ఉద్యమ గొంతుక
తన పాటలతో ప్రజలను చైతన్య
పరిచిన ప్రజాగాయకుడు
తెలంగాణ తొలి, మలిదశల్లో కీలక భూమిక పోషించిన ఘనుడు, జిల్లాలో అలుముకున్న విషాదఛాయలు, గద్దర్ మృతిపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు పలు ప్రజాసంఘాల సంతాపం

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: ప్రజాగాయకుడు గద్దర్ మృతితో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు 1949లో తూప్రాన్‌లో గుమ్మడి లచ్చమ్మ శేషయ్యలకు రెండవ సంతానం. చిన్నప్పటి నుంచే చా లా చలాకీగా ఉన్న గద్దర్ పదవ తరగతి వరకు తూ ప్రాన్‌లోనే విద్యాభ్యాసం చేశారు. అనంతరం హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పట్టా పొందారు. 1969 లో కెనరా బ్యాంక్‌లో ఉద్యోగిగా చేరిన అతను స్వ ల్పకాలంలోనే రాజీనామా చేసి ప్రజాసంఘాల్లో ప నిచేశాడు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గద్దర్ తన ఆటపాలతో తెలంగాణ ప్రజానికాన్ని అలరించారు.

అనాటి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలకభూమికి పోషించి నిజాం నిరంకుశ పాలనకు స్వస్తి పలకాలని తన గానంతో ప్రజలను చైతన్యపరిచారు. ప్రజాసంఘాలలో పనిచేసి కీలకమైన నేతగా ఎదిగిన వారిలో గద్దర్ ఒకరు. గద్దర్‌కు భార్య విమలమ్మ, కూతురు వెన్నెల, కూమారులు సూర్యం, చంద్రంలు, రెండవ కుమారుడు చంద్రం అస్వస్థతతో గతకొంతకాలం క్రితం మృతిచెందాడు. ప్రజా ఉద్యమంలో కీలక నేతగా పనిచేసి పేదల పా లిట పెన్నిదిగా నిలిచారు. తనదైన శైలిలో తెలంగా ణ యాసలో తన పాటలను, బావాలను ప్రజలకు హత్తుకునేలా వివరించిన విప్లవ గాయకుడు గద్దర్ ఇక లేడు అనే నిజాన్ని జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.

స్వస్థలం మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామం కావడంతో జిల్లా వాసులతో తనకు చాలా సత్సంబందాలు ఉన్నాయి. గత యేడాదిన్నరక్రితం ‘ఎట్లున్నది నా ఊరు’ అనే పుస్తకాన్ని రూపొందించేందుకు తూప్రాన్‌కు వచ్చి సన్నిహితులతో మాటమంతి కలిపారని స్తానికులు తెలుపుతున్నారు. ఆ పుస్తకం ఇంకా పూర్తికాలేదని చివరి దశలో ఉంది. గత ఆరునెలల క్రితం తన ఓటరు ఐడిని తూప్రాన్‌కు మార్చుకున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్ అల్వల్‌లోని నివాసం ఉంటున్నారు. స్వస్థలం తూప్రాన్‌లో ప్రస్తుతానికి ఆయన బంధువులు ఎవరు లేరు. గత కొంతకాలం క్రితం వరకు తన సోదరుడు నర్సింగరావు ఉండేవారు. అతను కూడా చనిపోవడంతో ప్రస్తుతం తూప్రాన్‌లోని సొంత నివాసంలో ఎవరు ఉండటం లేదు.

గద్దర్ మృతిపై ఎమ్మెల్యేలు, మంత్రుల దిగ్భ్రాంతి
గద్దర్ మృతిపై జిల్లా ప్రజలు, సీని ప్రముఖులతోపా టు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్నిపార్టీల రాజకీయ జాతీయ నాయకులు సైతం తీవ్ర ది గ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్ మృతిచెందడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గద్దర్ మృతిపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కు టుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉద్యమంలో గద్దర్ కీలకపాత్ర పోషించారని అన్నా రు. ఉద్యమ సమయంలో అనేక వేదికలపై ఆయన రాసి ఆలపించిన గేయాలు, ప్రజలను చైతన్యం చే శాయని చెప్పారు. అమ్మ తెలంగాణమా, పొడుస్తు న్న పొద్దుమీద నడుస్తున్న కాలమా, పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయని తెలిపారు. బడుగు బలహీనవర్గాలు విప్లవ స్ఫూర్తి గద్దర్ అని పేర్కొన్నారు. సామాజిక న్యాయ ప్రవక్తల మాటలు, భావాలు జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించి ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు.

యుద్ధనౌక మరణం తెలంగాణకు తీరనిలోటు: ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
ప్రజాగాయకుడు, తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ప్రాణం పోసిన యోధుడు ప్రజా యుద్దనౌక గద్దర్ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఎమ్మెల్సీ తెలిపారు. సమసమాజ స్థాపన కోసం జీవితాంతం తన పాట ద్వారా గద్దర్ పోరాటం చేశారని ఎమ్మెల్సీ కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News