Monday, January 20, 2025

ఓ అడవి బిడ్డ రంగుల ప్రస్థానం

- Advertisement -
- Advertisement -

ప్రేమ్ ఆసక్తి ఎప్పుడూ వేరుగానే వుండేది. కొట్టుకు సరుకులకు పోయినా ఆ పేపర్లు ఆసక్తిగా చూడటం తెల్లపేపర్ ఇస్తే ఆ దుకాణుదారుని బొమ్మలేసి ఇవ్వటం – చుట్టుపక్కల ప్రకృతి అందాలు కన్పిస్తే చిత్రం గీసేసుకోవటం వరకు 10వ తరగతిలో చేసేవాడు. తల్లిదండ్రులకు అక్షరం ముక్కరాదన్న భావనతో ఇంట్లో అమ్మనాన్నకు చదువు చెప్పటానికి ప్రయత్నం చేశాడు. నాన్నకన్నా త్వరగా నేర్చుకుని సంతకం పెట్టటం, ఫోన్ నెంబర్లు గుర్తుపట్టి రాయడం వరకు నేర్చుకుంది. బాహుబలి సినిమా 2015లో వచ్చిందేమో కానీ వాళ్ళ నాన్న మాత్రం 2006 లోనే పెద్ద బస్తాలని, అంతకన్నా పెద్ద పెద్ద ఇనుప ఇంజన్లని అవలీలగా ఎత్తి భుజాలమీద పెట్టుకొని అవతల పారేసాడు. 2000 సంవత్సరంలో వచ్చిన జంపన్న వాగు వరద ఎంతో మంది ప్రాణాన్ని బలితీసుకుంది కానీ వీరి ప్రాంతంలో ఎల్లయ్య ఈదుకుంటూ వెళ్ళి ఎంతోమందిని కాపాడేడు. అంతెందుకు ఈ బిడ్డలిద్దర్ని చెరొక భుజం మీద పడుకో పెట్టుకుని ఆ వరదల్లోనే కట్టుబట్టలతో బంధువులింటికి చేరాడు.

ఓ నాలుగైదేళ్ళ పిల్లోడు ఓ పడిపోయిన రాళ్ళ గోడ మీద కూర్చొని ఆడుకుంటున్న పిల్లలందర్నీ చూస్తున్నా డు. ఆ పిల్లల్లోని ఓ పిల్లాడు వీడిని చూసి వచ్చి తొడమీద గీకి పోయాడు. వాడి గోరు పడిన ప్రాంతం అంతా ఉబ్బినట్లుగా అయ్యి గీత మాత్రం స్పష్టంగా కనిపించసాగింది. దాన్ని తదేకంగా చూస్తూ కూర్చున్న ఆ గోడ మీద పిల్లాడు కాసేపటికి ఏదో మనసుకు తట్టినట్లుగా ఆ గీత చుట్టూ కళ్ళూ, ముక్కూ, చెవులూ పేర్చి ఒక బొమ్మను తయారు చేసి నవ్వుతూ మురిపెంగా చూసుకున్నాడు. వాడి నవ్వు చూసి ఆడుకుంటున్న పిల్లలందరూ వాడి చుట్టూ చేరారు.

మొదట్లో తాము గీరితే ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళే పిల్లాడు ఈ మధ్య రకరకాల బొమ్మల్ని చేయడం అందరికీ తమాషాగా అనిపించసాగింది. ఇంతలో మరో కొంటె కోణంగి వాడి చెయ్యి మీద బర్రున గీశాడు. చకచకా ఉబ్బిపోయింది ఆ ప్రాంతమంతా. పిల్లలు బెదిరిపోయి దూరంగా నిలబడ్డారు. ఆ పిల్లాడు మాత్రం తదేకంగా ఆ గాటును చూసి చకచకా ఒక ఈత చెట్టును గీశేశాడు. వెంటనే పిల్లలు చప్పట్లు కొట్టారు. కొందరు పెద్ద పిల్లలు ఆ చిన్ని బిడ్డను ఆ మొండిగోడ మీద నుంచి కిందకు దించారు. అందరూ ఇంటి దారి పట్టారు. దారి పొడుగునా వస్తున్న వాళ్ళందరికీ ఆ పిల్లలు వీడు గీసిన బొమ్మను చూపిస్తునే వున్నారు. దాన్ని చూసి అందరూ తెగ మెచ్చుకున్నారు. ఇంతలో ఆ చిన్న పిల్లోడి ఇల్లు రానే వచ్చింది. కూలికిపోయిన అమ్మానాన్న, స్కూలుకు పోయిన అన్న ఇంకా ఇల్లు చేరలేదు. తన మనసులాగే ఇల్లంతా ఖాళీ.

నిశ్శబ్దంగా ఓ మూలన కూర్చొని ఆ బొమ్మనే చూస్తూ ప్రేమగా దాన్ని తడుతూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో వాడికే తెలియదు. కానీ ఇదంతా నిశ్శబ్దంగా చూస్తున్న ఆ అడవితల్లి మాత్రం కాలచక్రం వంక మౌనంగా చూసింది. ఆ చూపులోని భావాన్ని అర్థం చేసుకున్న కాలం తానేదో చేయాలనుకుంది. చిత్ర కళారంగంలో మంచి గుర్తింపును రప్పించాలనుకుంది. పుట్టకతోనే ఎలర్జీతో బాధపడుతూ పుట్టిన ఆ బిడ్డ తన విచిత్ర రోగాన్ని చూసి ఏడవడం మానేసి దానిమీదే ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. కళ్ళని కదలనివ్వని రంగుల మేళవింపులో, మనసును మరలనివ్వని ఆ గీతల కలబోతలో వాడి ప్రపంచాన్ని వాడు స్వశక్తితో నిర్మించుకున్నాడు. చిన్ననాడే చిత్రాల మీద మనసు పారేసుకున్న వాడి ప్రపంచం అంతా గీతలే. ఆ గీతలే ఇస్రం ప్రేమ్ తలరాతను మార్చాయి.

అందరూ పిల్లల్ని కంటారు కానీ ఆ తల్లి అన్నెమ్మ ఇద్దరు బిడ్డల్ని కోల్పోయాక తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరో ఇద్దరు బిడ్డల్ని కనింది. ఆ ఊర్లో వాళ్ళు నష్టజాతకురాలని, గొడ్రాలని ఆడిపోసుకోవటం చూసి తట్టుకోలేక ఎన్నో సార్లు గుక్కపట్టి ఏడ్చేది. ఊరంతా పిచ్చిదన్నారు. ఎల్లయ్య పట్ల సానుభూతి చూపించి మరో పెళ్ళి చేసుకుని ‘వారసత్వాన్ని’ నిలబెట్టుకోమన్నారు. కానీ భార్యంటే – ఆ అడవి తల్లంత గొప్ప ప్రేమ ఎల్లయ్యకి. అందుకే పిల్లల్ని కోల్పోయిన ఆ తల్లి బాధను అర్థం చేసుకుని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు. చిన్నప్పటి నుండి దొర దగ్గర పని చేసిన కష్టం ముగింపుకొచ్చి అడవి బిడ్డలకు ఎసైన్డ్ భూములిచ్చారు ప్రభుత్వం.

వీళ్ళ దురదృష్టానికి ఆ భూమి అడవి మొదట్లోకి వచ్చింది. అది పొడుం భూమి. ఆ కొండల్ని తన కండల్తో కరిగించి, ఆ గుట్టల్ని తన గుండె బలంతో అదిలించి మొత్తానికి సాగునేలగా మార్చుకున్నారు ఆ దంపతులు. ఆ ఏడాది ‘మల్బరి’ సాగు చేశారు ఆ దంపతులు. అప్పట్లోనే రూ. 5,6 వేలు మిగిలాయి. ఆ ఏడే పుట్టిన బిడ్డకు అందుకే ‘సంతోష్’ అని పెట్టుకున్నారు. మరో రెండేళ్ళకు మళ్ళీ గర్భం దాల్చిన అన్నమ్మ బలహీనపడటమో, పోషకాహార లోపమో కానీ పొట్ట పగిలి మరో బిడ్డ పుట్టాడు. అప్పటి దాకా దూరదూరంగా వున్న బంధువు లందరూ మళ్ళీ దగ్గర చేరటం -ప్రేమగా వుండటం వల్ల ఆ బిడ్డకు ‘ప్రేమకుమార్’ అని పేరు పెట్టుకున్నారు.

కానీ వాళ్ళకు తెలియదు కదా -తమ కడుపులో అడవి అందాల్ని కెమేరా లెన్స్ లో బంధించే ఒక ఫోటోగ్రాఫర్, చిత్రాల్లో నిక్షిప్తం చేసే ఓ గొప్ప చిత్రకారుడు పుట్టాడని. ప్రేమ్ బాల్యం మొత్తం ఒడిదుడుకుల మధ్యే గడిచింది – అదేంటో తెలియని ఒక వింత ఎలర్జి ఆ చంటి బిడ్డను వేధించేది. తన చర్మాన్ని కాన్వాస్‌గా తీసుకుని తామున్న అడవిలోని చెట్లను, పుట్లను, మనిషి మొఖా న్ని వేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత తన 5,6 సంవత్సరాల శరీరం చిన్నదైపోయి పెద్ద కాన్వాస్‌గా సున్నమేసిన గోడలు, వీధుల్లో ప్రాక్టీస్ చేశాడు. ఆకాశమే హద్దుగా భావించే వాడి సృజనాత్మకతకు అవి కూడా చిన్నవైపోయాయి. అప్పుడే ఏటూరి నాగారాం నుండి సమ్మక్క, సారలమ్మ తల్లి దగ్గరకు మేడారం రోడ్డును ప్రారంభించింది ప్రభుత్వం – ఆ నల్లటి తారురోడ్డు చూసి ఆ చిన్నారి కళ్ళు విచ్చుకున్నాయి.

ఆ రోడ్డుల్లో ఉన్న సుద్దరాళ్ళను ఏరుకుని రోడ్డంతా బొమ్మలు వేయటం ప్రారంభించాడు. చిన్నప్పుడు ఓసారి ఇలా బొమ్మలేసుకుంటూ పక్కనున్న ఊరికి వెళ్ళిపోయాడట. వాళ్ళు గుర్తుపట్టి సైకిల్ మీద తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళారట. ఆ తర్వాత రంగురంగుల రంగురాళ్ళను ఏరటం వాటిని దంచుకోవటం నీళ్ళుపోసి నానబెట్టి వేపపుల్ల, చింతపుల్లల్ని నమిలి బ్రష్ లాగా చేసుకుని వాటితో ఈ సుద్దరంగుల్లో ముంచిన పుల్లల బ్రష్ లతో అద్భుతంగా రంగుబొమ్మలు వేయటం మొదలుపెట్టాడు. శరీరం, ఇంటిగోడలు, రోడ్లు ఇలా వాడి వయసు పెరిగే కొద్దీ వాడి కేన్వాసులు కూడా పెద్దవవుతూ వచ్చాయి. అందుకే ఆకాశమే హద్దుగా తన ఆశను బతికించుకోవడం కోసం పట్నం దారిపట్టాడు.

ప్రేమ్ ఆసక్తి ఎప్పుడూ వేరుగానే వుండేది. కొట్టుకు సరుకులకు పోయినా ఆ పేపర్లు ఆసక్తిగా చూడటం తెల్లపేపర్ ఇస్తే ఆ దుకాణుదారుని బొమ్మలేసి ఇవ్వటం – చుట్టుపక్కల ప్రకృతి అందాలు కన్పిస్తే చిత్రం గీసేసుకోవటం వరకు 10వ తరగతిలో చేసేవాడు. తల్లిదండ్రులకు అక్షరం ముక్కరాదన్న భావనతో ఇంట్లో అమ్మనాన్నకు చదువు చెప్పటానికి ప్రయత్నం చేశాడు. నాన్నకన్నా త్వరగా నేర్చుకుని సంతకం పెట్టటం, ఫోన్ నెంబర్లు గుర్తుపట్టి రాయడం వరకు నేర్చుకుంది.

బాహుబలి సినిమా 2015లో వచ్చిందేమో కానీ వాళ్ళ నాన్న మాత్రం 2006లోనే పెద్ద బస్తాలని, అంతకన్నా పెద్ద పెద్ద ఇనుప ఇంజన్లని అవలీలగా ఎత్తి భుజాలమీద పెట్టుకొని అవతల పారేశేవాడు. 2000 సంవత్సరంలో వచ్చిన జంపన్న వాగు వరద ఎంతో మంది ప్రాణాన్ని బలితీసుకుంది కానీ వీరి ప్రాంతంలో ఎల్లయ్య ఈదుకుంటూ వెళ్ళి ఎంతోమందిని కాపాడేడు. అంతెందుకు ఈ బిడ్డలిద్దర్ని చెరొక భుజం మీద పడుకో పెట్టుకుని ఆ వరదల్లోనే కట్టుబట్టలతో బంధువులింటికి చేరాడు. దాదాపు 10 కుటుంబాలు అక్కడే తలదాచుకుని మెల్లగా ఒక గుడిసెను వేసుకోవటం చేశారు.

నార్లాపూర్‌లోనే జడ్‌పిఎస్‌ఎస్‌లో 10వ తరగతి అయ్యాక, స్టేషన్‌ఘనపూర్‌లో సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్లో ఇంటర్ పూర్తిచేసి ఇంజనీర్ చదివితే ఉద్యోగాలు వస్తాయని ఎవరో చెబితే విని బిటెక్ మెకానికల్ లో చేరి దాని మీద మనసురాక మొదటి సంవత్సరంలోనే వదిలేసి పట్నం చేరాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఊర్లో ఆస్తులు లేవు. తనకు తెల్సింది – వచ్చిందీ బొమ్మలేయడమే. జెయన్‌టియులో చేరాలంటే మంచి ర్యాంకు రావాలి. సీట్లు పరిమితం అందునా మధ్యలో డుమ్మా కొట్టి వచ్చిన వైనం. ఆకలి కేకలు వేస్తుంటే నిలదొక్కుకోటానికి షాపింగ్ మాల్‌లో బాయ్‌గా పనిచేశాడు. ఏ మాత్రం టైం దొరికినా కమర్షియల్ వాల్ పెయింటింగ్ వేసే వారి దగ్గరకు, గుళ్ళల్లో బొమ్మలు వేసే వారి దగ్గరకు వెళ్ళి చిన్నచిన్న పనులు నేర్చుకున్నాడు.

ఆ పరిచయాలతో షాపింగ్ మాల్ ఉద్యోగం వదిలేసి ఆ వాల్ పెయింటింగ్ బృందాలతో కలిసి రాష్ట్రం మొత్తం తిరుగుతూ బొమ్మలు వేయడంలో మరిన్ని మెలుకువలు గ్రహించాడు. స్కూల్లో మహనీయుల బొమ్మలు వేసే కాంట్రాక్ట్ దక్కించుకున్న ఒక పెద్దాయన దగ్గర చేరి ఆ పనిలో తన పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ బిఎఫ్‌ఎ కోర్సు వివరాలు సేకరించాడు. పరీక్షలు రాసి రిజల్ట్ వచ్చే సమయానికి డెంగ్యూ. అది మిస్ చేసుకుని మరో ఏడాది దాకా ఇదే కష్టంతో బిక్కు బిక్కు మనే ఆశతో జీవితాన్ని లాగుతుంటే మళ్ళీ రిజల్ట్ వచ్చి తనకు సీట్ వచ్చిందనుకునేసరికి మళ్ళీ డెంగ్యూ జ్వరం సర్టిఫికెట్స్‌తో వెళ్ళిన అన్నయ్య ఇస్రం సంతోష్‌ని చూసి జాయినింగ్ డేట్ అప్పటికి తప్పకుండా అభ్యర్ధితో రావాలని ఆంక్ష పెట్టారు యాజమాన్యం. బెడ్ మీద ప్లేట్ లెట్స్ కౌంట్ 35 వేలకు పడిపోయి నీర్సంగా పడివున్న ప్రేమ్ తనకు సీటొచ్చిందని తెలిసిన ఆనందంతో చేతికి IV పెట్టుకునే వచ్చి బిఎఫ్‌ఎలో జాయిన్ అయ్యారు అదీ డిజైనింగ్ కోర్సులో అదే పెద్ద ట్విస్ట్.

అయినంపూడి శ్రీలక్ష్మి
9989928562

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News