- Advertisement -
సిటిబ్యూరోః ఇంటి నుంచి ఆడుకునేందుకు బయటికి వెళ్లిన బాలుడు కన్పించకుండా పోయాడు. వెంటనే బాలుడి ఆంటి చందానగర్ పోలీసులకు గత నెల 29వ తేదీన ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి వివరాలతో దర్పన్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఆపరేషన్ స్మైల్ చేపట్టిన సైబరాబాద్ పోలీసులు బాలుడు ప్రజ్వల్(9) ఆచూకీ కనిపెట్టారు. బాలుడికి మానసికస్థితి సరిగా లేకపోవడంతో మాటలు రావడంలేదు. దీంతో దర్పణ్ యాప్‌లో ఫేస్‌రికగ్నిషన్ ఉండడంతో వెంటనే బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నం చేయడంతో తెలిసిపొయింది. వెంటనే ఆపరేషన్ స్మైల్ అధికారులు బాలుడి బంధువులకు అప్పగించారు.
- Advertisement -