Saturday, December 21, 2024

తెలంగాణ పోలీసులు దేశానికే దిక్సూచి : మైనంపల్లి హన్మంతరావు

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: తెలంగాణ పోలీసులు సేవలు అభినందనీయమని వారు దేశానికే దిక్సూచి అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొనియాడారు. సోమవారం మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో 2కె రన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సఫిల్‌గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువతలో జోష్ పెంచేందుకు డిజె టిల్లు పాటకు ఎమ్మెల్యే కూడా వారితో జత కలిసి కొద్ది సేపు స్టెప్పులు వేసి ఉర్రూతలూగించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారు దశాబ్ధి ఉత్సవాలను 20 రోజుల పాటు ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వ అందచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికి చేరేలా అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

అదే విధంగా పోలీసుల పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ఉ పకమిషనర్ రాజు, సీఐలు రవికుమార్, నాగరాఉ, ట్రాఫిక్ సిఐ సుధీర్ కృష్ణ, కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, మేకల సునిత రాముయాదవ్, క్యానం రాజ్యలక్ష్మీ, మాజీ కార్పొరేటర్ జగధీష్‌గౌడ్ , బిఆర్‌ఎస్ మల్కాజిగిరి నియోజకవర్గం అధికార ప్రతినిధి జీఎన్‌వీ సతీష్‌కుమార్, సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాము యాదవ్, ఉపేందర్‌రెడ్డి, డివిజన్‌ల అధ్యక్షులు తులసీ సురేష్, పీవీ సత్యనారాయణ, నోరి సత్యమూర్తి, నాయకులు సంతోష్ రాందాస్, ఇబ్ర హ్మీం, బాబు, సత్యనారాయణ,ఆగమయ్య, శంకర్, బాలరాజు యాదవ్, నరేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు
జాతిని సమైక్య పరిచిన నేత సర్దార్ వల్లబాయ్ పటేల్ : ఎమ్మెల్యే మైనంపల్లి
దేశ ఐక్యత, పటిష్టతకు కృషి చేసిన మహానుభావుడు సర్ధార్ వల్లబాయ్ పటేల్ అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మై నంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం ఎస్‌పీనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సర్ధార్ వల్లబాయ్ పటేల్ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే పాల్గొని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతిని సమైక్య పరచడంలో సర్ధార్ వల్లబాయ్ పటేల్ కృషి చిరస్ధాయిగా నిలిచి పోతుందన్నారు. స్వాతంత్య్ర సమర యో ధులు ఎంత మంది ఉన్నా సర్ధార్ వల్లబాయ్ పటేల్ గుర్తింపే వేరు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్‌కుమా ర్, మాజీ కార్పొరేటర్ ఎన్. జగధీష్‌గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News