Saturday, December 21, 2024

దేశంలోనే తెలంగాణ పోలీసులు భేష్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : దేశం మొత్తం మీద తెలంగాణ పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబర్చుతున్నారని, అన్ని వర్గాల ప్రజలతో శెభాష్ అనిపించుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన వెంటనే పోలీసు శాఖ పనితీరును మరింత పర్చేందుకు గాను పెద్ద సంఖ్యలో వాహనాలు, మౌలిక సదుపాయాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చామన్నారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఖమ్మం జిల్లా జీళ్లచెర్వు నుంచి కూసుమంచి మండల కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంపి రవిచంద్ర ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ తిరిగి ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పడడం, రాష్ట్రం మరింత గొప్పగా అభివృద్ధి చెందడం ఖాయమని ఎంపి వద్దిరాజు వివరించారు. ఈ ర్యాలీలో ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, కూసుమంచి సిఐ, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్థానికులు జాతీయ జెండాలు చేబూని పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News