Thursday, January 23, 2025

దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో తెలంగాణ పొలీస్

- Advertisement -
- Advertisement -

బాలాపూర్: దేశంలోనే తెలంగాణ పొలీసులు నెం:1 స్ధానంలో నిలువడం గర్వకారణం అని, ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో రాష్ట్రంలోని పొలీసు వ్యవస్ధ అత్యంత పటిష్టవంతంగా రూపుదిద్దుకుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర విర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మీర్‌పేట్ పొలీస్‌స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో మీర్‌పేట్,బడంగ్‌పేట్ కార్పొరేషన్ల పరిధిల్లో సోమవారం నిర్వహించిన తెలంగాణ 5కె రన్‌ను మంత్రి సబితఇంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో పొలీసులు వ్యవహరించే పాత్ర గొప్పదని, శాంతి, భద్రతల పరిరక్షణలో వారి సేవలు ప్రశంసనీయమని అన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పొలీసులకు నూతన వాహనాలు,ఆధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారని, ప్రత్యేకంగా షీటీమ్‌లు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. సామాజిక కార్యక్రమాల్లో తమవంతుగా పాలుపంచుకునేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు జరిగిన కార్యక్రమంలో రన్‌లో పాల్గొన్న యువతలో ఉత్సహాన్ని నింపుతూ వారితో కలిసి కదం తొ క్కిన అనంతరం త్రివర్ణ బెలూన్లను గాలిలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బినగర్ జోన్ డిసిపి సాయిశ్రీ, వనస్థ్ధలిపురం సబ్‌డివిజన్ ఏసిపి పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News