Sunday, January 19, 2025

తనిఖీల్లో స్వాధీన సొత్తు రూ.525 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకు 24 గంటల్లో రూ. 6.20 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో నగదు, మద్యం, మత్తు పదార్థాలు, బంగారం, వెండి, ఆభరణాలు, ఉచితాలను పట్టుకున్నారు. అందులో నగదు రూ. 2,54,32,910, పట్టు బడిన మద్యం విలువ  రూ. 2,72,27,503 (మద్యం 2174.035 లీటర్లు,

నల్ల బెల్లం – 525.85కేజీలు, ఆలం 47 కేజీలు), స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు రూ.42,57,400 (47.260 కిలోల గంజాయి,93.83 కిలోల ఎన్‌డిపిఎస్), ఇతర వస్తువులు/ఉచితాల స్వాధీనం రూ.51,56,900 (12182 – కిలోల బియ్యం, 669 -చీరలు) ఉందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. గత నెల అక్టోబరు తొమ్మిదో తేది నుంచి బుధవారం వరకు రూ.5,25,10,90,546 కోట్లు విలువైన సొత్తు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News