Sunday, December 22, 2024

దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్‌గా సేవలు

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి : ప్రజలకు మెరుగైన సేవలు అందిచడంలో దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్‌వన్‌గా ఉందని రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ అలీ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్‌స్టేషన్‌ను రాష్ట్ర కార్మిశాఖమంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధను మెరుగుపరిచి నేరాలను తగ్గించామని తెలిపారు.

మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీటీంలు ఏర్పాటు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిచడం కోసం నూతనంగా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నమని అందులో భాగంగా చర్లపల్లిలో నూతనంగా పోలీస్‌స్టేషన్ ప్రారంభించామని తెలిపారు. ఈసందర్భంగా నూతనంగా చర్లపల్లి సిఐగా మల్లికార్జున్‌రెడ్డి భద్యతలు తీసుకున్నారు. ఈకార్యక్రమంలో రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహన్, మల్కాజిగిరి డిసిపి జనకి,

చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవియాదవ్, కూషాయిగూడ ఎసిపి వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పజ్జురిపావనిరెడ్డి, సింగిరెడ్డి దన్‌పాల్‌రెడ్డి, గుండారపు శ్రీనివాస్‌రెడ్డి, కుషాయిగూడ సిఐ ప్రవీన్‌కుమార్,చర్లపల్లి ఐలా చైర్మాన్ జెక్క రోషిరెడ్డి, కార్యదర్శి అంబటి వెంకటేశ్వర్‌రెడ్డి,స్ధానిక నాయకులు, వివిద కాలనీ సంఘాల ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News