Friday, December 20, 2024

తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  •  కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్

కడ్తాల్ : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ అన్నారు. పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పరుచుకోని వారి సమస్యలు పరిష్కరించడంలో విజయం సాధిస్తున్నారని ఆయన తెలిపారు. కడ్తాల మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమనగల్లు పోలీసు సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష దినోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పోలీసులు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన సురక్ష దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోని త్వరగా కేసులు ఛేదిస్తున్నారని ఆయన వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ పోలీసు వ్యవస్థ మొదటి స్థానంలో ఉందని శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ నెంబర్‌వన్ ప్లేస్‌లో ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రజల కోసం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని , హోంగార్డులకు గౌరవ వేతనం 30 శాతం పెంచిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. సురక్ష వేడుకల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ హరీష్ శంకర్‌గౌడ్, పోలీసు సిబ్బందికి జ్ఞాపికలను అందజేసి శాలువాలతో సత్కరించి, అభినందించారు.

కార్యక్రమంలో ఆమనగల్లు సిఐ జాల ఉపేందర్, ఎంపిపి దేపావత్ కమ్లీ మోత్యనాయక్, జెడ్పిటిసి జర్పుల దశరథ్‌నాయక్, వైస్ ఎంపిపి బావండ్లపల్లి ఆనంద్, సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు కంబాల పరమేష్, నాయకులు, ప్రజాప్రతినిధులు లచ్చిరాంనాయక్, బండి చంద్రమోళి, జోగువీరయ్య, చందోజీ, ఎర్రోళ్ల రాఘవేందర్, లాయక్‌అలీ, లాల్‌కోట నర్సింహ్మ, సిద్దిగారి దాసు, ఎంపిడిఒ కె. రామకృష్ణ, సుమన్‌నాయక్, జహంగీర్‌అలీ, సులోచన సాయిలు, తులసీరాంనాయక్, పోలీసు సిబ్బంది తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News